దాదాపు రెండు నెలల లాక్ డౌన్ తర్వాత తన తండ్రి చంద్రబాబుతో కలిసి అమరావతికి తిరిగొచ్చిన నారా లోకేశ్....మహానాడు కార్యక్రమంలో పెద్ద స్పీచ్ ఇచ్చారు. పక్కా స్క్రిప్ట్ రాసుకుని వచ్చినట్లు ఉన్నారు. అందుకే జగన్ ప్రభుత్వంపై వరుస విమర్శలు చేశారు. కనీసం పార్టీని ఎలా బలోపేతం చేయాలి...తాను ఇంకా మంచి నాయకుడు ఎలా ఎదగాలి అనే విషయాలని గాలికొదిలేసి, జగన్‌ పాలన దారుణంగా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు.

 

అసలు వరుస పెట్టి జగన్ ప్రభుత్వం అరాచకాలు చేస్తున్నట్లు చెప్పారు. జే గ్యాంగ్‌ భూములన్నీ కొట్టేస్తోందని, విశాఖలో భూములన్నీఎంపీ విజయసాయిరెడ్డి కొట్టేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వైజాగ్‌లో నాలుగు నెలల్లో 500 భూకబ్జా కేసులు నమోదయ్యాయని, పేదల ప్రజల నెత్తురును మద్యం రూపంలో తాగుతున్నారని, జగన్ నిర్వాకం వల్ల భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు.

 

శానిటైజర్లు, మాస్కుల, టెస్టింగ్‌ కిట్లలో అవినీతి జరిగిందని, పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భూములు లాక్కుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. అయితే సాధారణంగా చినబాబు ఇంత మేటర్ మాట్లాడలేరు. ఎవరు పక్కా స్క్రిప్ట్ రాసి ఇస్తే చినబాబు చదివేసినట్లు తెలుస్తోంది. సరే ఏదొరకంగా స్క్రిప్ట్ చదివారు సరే అనుకుంటే, చేసిన విమర్శలకు ఆధారాలు కూడా చూపిస్తే ఇంకా నమ్మశక్యంగా ఉండేది. కానీ లోకేశ్ అదేం చేయలేదు.

 

కేవలం జగన్ ప్రభుత్వంపై బురద జల్లాలనే ఉద్దేశంతోనే చినబాబు ఇలాంటి విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. ఆయన చేసిన ఆరోపణలకు ఒక్క ఆధారం చూపించిన జనాలు నమ్మేవారు. అలా కాకుండా ఈ విధంగా మాట్లాడితే, జనం నమ్మడం కష్టం. పైగా ఇలా మాట్లాడటం వల్ల జగన్‌కు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా మంచిని మంచిగా, తప్పుని తప్పుగా చూపిస్తే పార్టీకి మంచి జరుగుతుంది. అలా కాకుండా ఇలా గుడ్డిగా విమర్శలు చేస్తే టీడీపీకి ఇంకా పెద్ద డ్యామేజ్ జరగడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: