ప్రతిపక్ష టీడీపీ నేతలు మంత్రి కొడాలి నానినీ వదిలేలా కనిపించడం లేదు. ఇష్టారాజ్యంగా కొడాలిపై ఆరోపణలు చేసేస్తున్నారు. కొడాలి ఎప్పుడు చంద్రబాబుని, కొందరు టీడీపీ నేతలని టార్గెట్ చేస్తూ...తీవ్ర విమర్శలు చేస్తారనే విషయం తెలిసిందే. పైగా టీడీపీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఆ పార్టీని వదిలేసి వస్తూ..బాబుని ఓ రేంజ్‌లో తిట్టేశారు. అలాగే వైసీపీలోకి వచ్చాక బాబు అంటే ఒంటికాలి మీద వెళ్లిపోతారు.

 

ఇక ప్రస్తుతం మంత్రిగా ఉండటంతో టీడీపీ నేతలకు చుక్కలు చూపించేస్తున్నారు. మంత్రి అయినా సరే చంద్రబాబుని విమర్శించడంలో ఏ మాత్రం తగ్గరు. నోటికి పనిచెబుతూ మరీ..చంద్రబాబుని, దేవినేని ఉమాలపై విరుచుకుపడతారు. అయితే ఈ విధంగా కొడాలి..చంద్రబాబుని టార్గెట్ చేసి మాట్లాడటం వల్లే అనుకుంటా...ఇప్పుడు టీడీపీ నేతలు కొడాలిని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

 

గత కొన్నిరోజులుగా గుడివాడలో గడ్డం గ్యాంగ్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అంటే పరోక్షంగా కొడాలి నాని, ఆయన అనుచరులు గుడివాడ నియోజకవర్గంలో భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవలే మాజీ మంత్రి దేవినేని ఉమా..కొడాలి నాని భూ కబ్జాలు చేస్తున్నారని విమర్శలు చేశారు. కొడాలి నాని గుడివాడలోని వలివర్తిపాడు పంచాయతీలో బడుగు బలహీనవర్గాల కాలనీలో 25 ఫ్లాట్లు కొన్నారని, అయితే అక్కడ ఓ టీచర్ కూడా ప్లాట్ కొన్నారని తెలిపారు. అక్కడ ఖాళీ చేయమంటే చేయనన్నందుకు ఆ టీచర్‌పై దాడి చేశారని ఆరోపించారు.

 

కొడాలి నాని కల్యాణ మండపానికి దగ్గరలో ఉన్న ఈ స్థలాలన్నీ కబ్జా చేసి.. అక్కడ రాజ భవనాన్నో, విల్లా కట్టాలనే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారని అన్నారు. ఇక తాజాగా కూడా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా కొడాలిపై విమర్శలు చేశారు. గుడివాడలో గడ్డం బాసు భూకబ్జాలకు అంతే లేదన్నారు. అయితే టీడీపీ నేతలు ఆధారాలు ఏమి లేకుండా అనవసరంగా ఆరోపణలు చేస్తూ కొడాలిని కెలుకుతున్నట్లుగా కనిపిస్తోంది. మరి ఈ ఆరోపణలపై కొడాలి ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: