గత ఐదేళ్లలో చంద్రబాబు పాలనలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. మాటలు కోటలు దాటితే చేతలు గడప కూడా దాటలేదు. ప్రతి విషయాన్ని గొప్పగా చెప్పుకుని డప్పుకొట్టారు. గ్రాఫిక్స్‌లో అభివృద్ధి చేసి చూపించారు. ఇక అలా చేయడం వల్లే ప్రజలు బాబుని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టి, జగన్‌కు అత్యధిక సీట్లు కట్టబెట్టి అధికార పీఠం మీద కూర్చోబెట్టారు. ఇక జగన్ పాలన మొదలై సంవత్సరం అయిపోయింది.

 

ఈ సంవత్సర కాలంలో జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు విమర్శలు చేయడం, ఆ విమర్శలకు వైసీపీ నేతలు కౌంటర్లు కూడా ఇస్తున్నారు. తమ మీద విమర్శలు చేస్తే గత ఐదేళ్లలో చంద్రబాబు పాలన గురించి మాట్లాడుతూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పాలన గురించి మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా విమర్శలు చేశారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, చంద్రబాబు పాలనలో గ్రాఫిక్స్‌లో అభివృద్ధి చూపించారని, మహానాడు కార్యకర్తలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని మంత్రి మండిపడ్డారు.

 

అలాగే గొప్పలు చెప్పే చంద్రబాబు, వెన్నుపోటు గురించి కూడా మాట్లాడాలని అవంతి కామెంట్ చేశారు. అయితే అధికార పార్టీ మంత్రిగా ప్రతిపక్షంపై అవంతి విమర్శలు చేశారనుకోవచ్చు. కానీ గత ఐదేళ్లు అవంతి టీడీపీలోనే ఉన్నారు. ఐదేళ్లు ఎంపీగా పనిచేశారు. ఇక ఇదే విషయాన్ని తెలుగు తమ్ముళ్ళు గుర్తుచేస్తు, అవంతిపై ఫైర్ అవుతున్నారు. అప్పుడు పార్టీలో ఉన్నప్పుడూ చంద్రబాబు చేసిన గ్రాఫిక్స్ అభివృద్ధి కనిపించలేదా? అని ప్రశ్నిస్తున్నారు.

 

ఇంకా కార్యకర్తలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటున్నారు...మీరు కూడా ఐదేళ్లు మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు కదా...అప్పుడు ఇదే విషయం ప్రశ్నించాలి కదా అని నిలదీస్తున్నారు. ఇక వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నారు. ఐదేళ్లు చంద్రబాబు పక్కనే  ఉన్నారు...అప్పుడు ఆ మాట చెప్పాల్సింది కదా అని అడుగుతున్నారు. నిజమైన వెన్నుపోటుదారులు ఎవరో ప్రజలకు తెలుసని తమ్ముళ్ళు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: