దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గకపోగా, రోజురోజుకు పెరుగుతున్న తీరు అన్ని రాష్ట్రాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ మహమ్మారి పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. కరోనా ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మార్చి 24 వ తేదీ నుంచి అమలు చేస్తూనే ఉన్నారు. మూడో విడత దగ్గర నుంచి కొన్ని సడలింపులు ఇవ్వడంతో పాటు, వలస కూలీలను ఆయా రాష్ట్రాలకు పంపించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ఎక్కడివారక్కడ వెళ్ళిపోతుతుండడంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగిపోతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

IHG


ఈ ఐదు రాష్ట్రాలలో అన్ని రవాణా మార్గాలను మూసివేయాలని గురువారం ముఖ్యమంత్రి యుడియరప్ప అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విమానాలు, రైళ్లు, వాహనాలు ఇలా ఏ రూపంలోనూ రాష్ట్రంలోకి అనుమతించకూడదు అని నిర్ణయించుకున్నారు. అలాగే కర్నాటక నుంచి ఆయా రాష్ట్రాలకు వెళ్లే వారికి ఎటువంటి ఆంక్షలు విధించకుండా నిరభ్యంతరంగా వారు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నిరన్యం తీసుకుంది. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో 24 గంటల్లోనే 75 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

IHG's Covid-19 ...


 దీంతో మొత్తం కేసుల సంఖ్య 2493 చేరింది. వీరిలో 809 మందిని డిశ్చార్జి చేయగా 47 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1635 మందికి చికిత్స అందిస్తున్నారు. గురువారం ఒక్కరోజే 25 మందిని డిశ్చార్జ్ చేశారు. 75 పాజిటివ్ కేసుల్లో 46 కేసులు మహారాష్ట్ర నుంచి వచ్చినవారే. ఆరుగురు తమిళనాడు, ఇద్దరు తెలంగాణ, కేరళ, ఢిల్లీ నుంచి ఒక్కరు వచ్చారని అధికారులు తెలిపారు. మరొకరు యూఏఈ నుంచి వచ్చారని పేర్కొన్నారు. రోగుల బంధువులు ఏడుగురికి వైరస్ సోకిందని తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: