కరోనా వైరస్ వేళలో నిత్యం మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను ప్రభుత్వ అధికారులను అలర్ట్ చేస్తూ కేసీఆర్ సరిగ్గా డీల్ చేశారు. కరోనా వైరస్ కారణంగా భయంతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు ధైర్యం చెబుతూనే మరోపక్క వైరస్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలో అన్న దాని గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ లు ఇచ్చారు. కేసిఆర్ మీడియా సమావేశం అంటే చాలా మంది ఆసక్తిగా వింటారు. ప్రపంచంలో ఏం జరుగుతుంది అదే విధంగా దేశంలో మరియు రాష్ట్రాలలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నా పరిణామాలన్నీ ప్రస్తావిస్తూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తుంటారూ. ముఖ్యంగా ప్రత్యర్థులపై సెటైర్లు వేస్తూ మీడియా సమావేశాలలో కే‌సి‌ఆర్ వేసే డైలాగులకి చాలామంది పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు.

 

ఒకపక్క నవ్విస్తూనే మరోపక్క కౌంటర్లు వేసేస్తుంటారు కే‌సి‌ఆర్. అటువంటిది మొట్టమొదటిసారి బుధవారం మీడియా సమావేశం జరగాల్సి ఉండగా కే‌సి‌ఆర్ వెనకడుగు వేశారు. ఎన్నడూ లేని విధంగా కే‌సి‌ఆర్ జరగాల్సిన మీడియా సమావేశంలో పాల్గొనకపోవడం పెద్ద చర్చినీయాంశంగా మారింది. టిఆర్ఎస్ పార్టీ లో అసలేం జరుగుతోంది అన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో నెలకొంది. అయితే ఈ తరుణంలో ప్రస్తుతం ఇటీవల పరిస్థితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటంతో  పాటు కొంతమంది రిపోర్టర్లతో చాలా దురుసుగా కే‌సి‌ఆర్ సమాధానం ఇవ్వటంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

దీంతో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అదేవిధంగా కరోనా వైరస్ రోగ నిర్ధారణ పరీక్షలు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు పలు అంశాలు మీడియా సమావేశంలో ప్రస్తావన వచ్చే అవకాశం ఉండటంతో ఈ తలనొప్పులు ఎందుకని కే‌సి‌ఆర్ ఇటీవల జరగాల్సిన మీడియా సమావేశానికి డుమ్మా కొట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కావాలని ఇరుకున పెట్టే విధంగా కొన్ని మీడియా సంస్థలకు సంబంధించిన రిపోర్టర్లు ప్రశ్నలు వేయడంతో కే‌సి‌ఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మరోపక్క వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: