విశాఖ లో గ్యాస్ లీకేజీ ఘటన  ఎంతటి నష్టాన్ని కలిగించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో  ప్రాణ నష్టాన్ని కలిగించింది ఈ ఘటన . ఈ ఘటనలో ఏకంగా 13 మంది ప్రాణాలు కోల్పోగా ఎంతోమంది ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఎన్నో  మూగజీవాల ఇప్పుడు ప్రాణాలు వదిలాయి . జనజీవనం మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఇక ఈ గ్యాస్ లీకేజీ ఘటన ఒక్కసారిగా దేశాన్ని మొత్తం కబళించింది. ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీ నుండి  విషవాయువు లీకవడం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడం.. ప్రజలు ఎక్కడికక్కడ కుప్పకూలి పోవడం గంటల వ్యవధిలో జరిగిపోయింది. అయితే ఈ ఘటనలో ని ప్రమాద బాధితులకు కూడా జగన్ సర్కార్ భారీగా నష్టపరిహారం ప్రకటించిన  విషయం తెలిసిందే. 

 

 ఈ దుర్ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు ఏకంగా కోటి రూపాయల పరిహారాన్ని అందించింది జగన్ సర్కార్. అంతేకాకుండా ఈ ఘటనలో చికిత్స తీసుకుంటు ఆరోగ్యం  విషమించింది వారికి పది లక్షల.. మిగిలిన వారికి  లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. అయితే జగన్మోహన్ రెడ్డి  సర్కార్ ఈ పరిహారాన్ని ప్రకటించడం సత్వరంగా రెండు మూడు రోజుల్లోనే స్వయంగా అధికార పార్టీ నేతలు వెళ్లి పరిహారాన్ని అందించడంపై ఎన్నో ప్రశంసలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. 

 


 అయితే తాజాగా విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలోనే బాధిత కుటుంబాలకు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన పరిష్కారం మాత్రం అసలు బాగోలేదు అంటున్నారు విశ్లేషకులు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు 50 వేల పరిహారం అందించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయించారు. అయితేఅంత తక్కువ  నష్టపరిహారం ప్రకటించడం అసలు బాగోలేదు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. టిడిపి పార్టీ ఆర్థికంగా మంచి పొజిషన్ లోనే ఉండటం కారణంగా.. కనీసం రెండు లక్షలు అయినా పరిహారం ప్రకటిస్తే బాగుండేదనే కానీ చంద్రబాబు స్థాయి కి కేవలం యాభై వేలు మాత్రమే ప్రకటించడం సరికాదు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: