భారత దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలిసిందే. మొదట్లో అతి తక్కువగా నమోదైన కేసుల సంఖ్య ప్రస్తుతం భారీగా పెరిగి పోతోంది. కేంద్ర  ప్రభుత్వం అసమర్థత కారణంగానే ప్రస్తుతం కేసుల సంఖ్య భారీగా పెరిగింది అని  ప్రతిపక్ష పార్టీలతో పాటు ఎంతో మంది తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా  వైరస్ సమర్థవంతంగా కట్టడి చేయలేకపోయింది అంటున్నారు. అయితే కేంద్రం ఏం చెబుతుంది అంటే ప్రస్తుతం కరోనా  వైరస్ కేసులు పెరుగుతున్నాయని.. కానీ మనం ఇంకా కంట్రోలింగ్ స్టేజ్ లోనే ఉన్నాము అంటూ ఒక క్లారిటీ ఇస్తుంది. ఈ క్రమంలోనే కరోనా  లెక్కల ప్రకారం చూస్తే సంక్రమణ వేగం తగ్గుతుంది అని చెబుతున్నారు నిపుణులు

 


 ప్రస్తుతం 90 శాతం సడలింపులు ఇచ్చిన  తర్వాత కూడా సంక్రమణ కేవలం 5 శాతం మాత్రమే ఉంది. మరో వైపు వరుసగా దేశంలో ఆరో రోజు  కూడా ఆరు వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయిన  ఎవరరూ  భయపడాల్సిన పరిస్థితి ఏమీ లేదని ప్రస్తుతం భారతదేశం కంట్రోలింగ్ స్టేజ్ లోనే ఉంది అంటున్నారు నిపుణులు. ఇక జూన్ 17 నాటికి దేశంలో ఏ రాష్ట్రంలో ఎంత మొత్తంలో కేసులు పెరిగనున్నాయి అనేది కూడా అంచనా వేశారు ప్రస్తుతం నిపుణులు. అస్సాం రాష్ట్రంలో 80 వేలు, ఛత్తీస్ ఘడ్ లో  లక్షకుపైగా కేసులు పెరిగే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. ఒక మహారాష్ట్రలోని దాదాపుగా కోటి కరోనా  కేసులు దాటే అవకాశం ఉందని.. మహారాష్ట్ర  చత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను  రెడ్ జోన్ లుగా  ఉండగా.. జమ్మూకాశ్మీర్ కర్ణాటక జార్ఖండ్ రాష్ట్రాలు ఆరెంజ్ లో ఉంటాయని... అంటున్నారు విశ్లేషకులు

 

 మొత్తంగా చూసుకుంటే దేశ వ్యాప్తంగా కేవలం 10 రాష్ట్రాలలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు కాబోతున్నాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. తాజాగా ఢిల్లీ ఐఐటి పరిశోధక బృందం ఈ అంచనా వేసింది. అయితే కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. పెరుగుతున్న కేసులతో ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెబుతోన్నారు . నిపుణులు చెబుతున్న దానికి అర్థం.. కంగారు పడొద్దు  అంటే విచ్చలవిడిగా తిరగాలని కాదని మన జాగ్రత్తలో మనం ఉండి కంగారు పడకుండా ధైర్యంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: