చప్పట్లు కొట్టారు... లైట్లు ఆర్పారు... క్యాండిల్స్ వెలిగించారు. అందరూ అన్నీ చేశారు. కానీ దేశం నుంచి కరోనా ని మాత్రం తరిమి కొట్ట లేకపోయాము. రోజురోజుకు వేలల్లో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. మొదట్లో వందలు, వేలల్లో ఉండగా విధించిన లాక్ డౌన్  సమయంలోనే ఈ కేసుల సంఖ్య ఇప్పుడు లక్షలకు చేరిపోయింది. కరోనాను నియంత్రించడానికి లాక్ డౌన్ విధించామని గొప్పగా చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ మాటలను ప్రజలంతా శ్రద్ధ గానే పాటించారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే మార్గమని ప్రధాని మోదీ చెప్పిన మాటలను జనాలు నమ్మరు. కానీ ఇప్పటికే నాలుగు విడతలుగా లాక్ డౌన్ ను పొడిగించుకుంటూ వచ్చారు. ఇప్పుడు చైనాను మించిపోయేలా భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. లక్ష నలభై వేలకు చేరువలో పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీనిని ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. 

IHG


మొదటి రెండు విడతలు కఠినంగా అమలు చేసినా, ఆ తర్వాత సడలింపు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎగ్జిట్ ప్లాన్ తెలియక కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చింది అని ఇప్పుడు నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది, మీరే ఆదుకోవాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సడలింపులు ఇచ్చారు. దీంతో మరింతగా పరిస్థితి అదుపు తప్పి పోయింది. అసలు మూడు, నాలుగో విడత లాక్ డౌన్ నుంచే కరోనా కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ విధించడం, దానికి మినహాయింపు ఇవ్వడం వంటి వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర అసలు ప్రణాళిక ఏదైనా ఉందా అని ఇప్పుడు విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 


సోనియా గాంధీ  సైతం ఇదే అంశాన్ని లేవనెత్తారు. లాక్ డౌన్ అమలు, నిబంధనల సడలింపునకు సంబంధించి కేంద్రం వద్ద ఏ ప్రణాళిక లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది అని,ఈ రెండు నెలల్లో కరోనా కేసులు సంఖ్య లక్షలకు చేరిందని, కేంద్రం ఈ పరిస్థితిని ముందుగా అంచనా వేయడంలోనూ, లాక్ డౌన్ అమలు చేయడంలోనూ ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించింది అనే విమర్శలు వస్తున్నాయి. దీనికి కేంద్రం వద్ద కూడా సరైన సమాధానం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: