ఈరోజు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు  జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించిన విషయం తెలిసిందే. ఎంతో మంది ప్రముఖులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలోనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే దీనిపై అధికార పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీని లాక్కుని ఆయనను మోసం చేసిన చంద్రబాబు ప్రస్తుతం ఆయనకు నివాళులు అర్పిస్తే  ఎన్టీఆర్ ఆత్మక్షోభ జరుగుతుందని ఆరోపిస్తున్నారు. ఆయన రాజకీయాలకు పనికిరాడు అంటూ ఎన్నో ప్రచారాలు చేసి చంద్రబాబు టిడిపి పార్టీ ని కైవసం చేసుకున్నారు.

 


 అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఎన్టీఆర్ కి నివాళులర్పిస్తూ ఎన్టీఆర్ ఆత్మ క్షోభ చెందుతుందని ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఏమంటున్నారు అంటే.. ఒకవేళ చంద్రబాబు లేకపోతే టిడిపి పార్టీ ఇప్పటివరకు సజీవంగా ఉండేదా  అని ప్రశ్నిస్తున్నారు. అయితే టీడీపీ నేతల ప్రశ్న వెనుక... చాలా అర్ధం  ఉంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఎన్టీఆర్ ఎంతో మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ అయినప్పటికీ.. చరిష్మా  తో తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటికీ... ఆయన ఎంతో కోపంతో ఉండే వారిని ప్రతి విషయంలో ఎంతో ఆగ్రహానికి గురయ్యేవారు  అని చెబుతున్నారు విశ్లేషకులు. 

 

 అదే సమయంలో ఆయన నమ్మిన వారికి పార్టీకి సంబంధించిన అన్ని బాధ్యతలు అప్పగిస్తూ  పలుమార్లు మోసపోయారూ  కూడా. గతంలో నాదెళ్లను నమ్మి మోసపోయిన ఎన్టీఆర్ ఆ తర్వాత లక్ష్మీపార్వతి కి  కూడా పార్టీలో బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఇంతలో నారా చంద్రబాబు నాయుడు తెర మీదికి వచ్చి లక్ష్మీపార్వతి ని పార్టీ నుంచి కాస్త దూరం పెట్టిన పార్టీని కైవసం చేసుకున్నారు. అయితే ఒక నిర్మాణాత్మకమైన పార్టీగా ముందుకు సాగేలా చేయటం  చంద్రబాబు కు బాగా తెలుసు అంటున్నారు విశ్లేషకులు. ప్రతిపక్షాలను ఎదిరించడంలో  ఆయన అధికారాన్ని కొనసాగించడంలో చంద్రబాబు తన వ్యూహాలను అమలు చేస్తున్నారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: