మహమ్మారి కరోనా వైరస్ సృష్టించిన అలజడికి ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో  చాలా వరకు పెళ్లిళ్లు ఆగిపోయాయి. పెళ్లి కుదిరిన సరే చేసుకునే పరిస్థితి గాని అవకాశాలు గాని లేవు. సాధారణంగా పెళ్లంటే హంగులు ఆర్భాటాలు బంధు మేళాలు ఇలా రకరకాలుగా అంగరంగ వైభవంగా కుటుంబ సమేతంగా జరుపుకునేది. మనిషి జీవితంలో ఒక్కసారి జరిగేది. అటువంటి పెళ్లి విషయంలో ఘనంగా జరగాలని నలుగురిలో జరగాలని చాలామంది లాక్ డౌన్ వల్ల వాయిదా పడిన తర్వాత ఆంక్షలు సడలింపులు ఇచ్చిన వాయిదా వేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పెళ్లి చేసుకోవాలి అని ఇద్దరు అమ్మాయిలు పోరాటానికి తెగపడ్డారు.

 

ఈ విషయం ఇటీవల వార్తలు వెలుగులోకి వచ్చింది. మే 25వ తారీకు నుండి దేశీయంగా విమాన రాకపోకలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో పాస్ పోర్ట్ కేంద్రాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా ఇద్దరు అమ్మాయిలు మేము పెళ్లి చేసుకోవాలి మాకు పాస్ పోర్ట్ ఇవ్వండి అంటూ పాస్ పోర్ట్ కార్యాలయం దగ్గర హడావిడి సృష్టించారు. అక్కడ ఆఫీస్ ముందు వందలాది మంది పాస్ పోర్ట్ కోసం క్యూ కట్టారు. వారిలో కూడా ఎక్కువగా పెళ్లి కూతుళ్లే ఉన్నారట. పంజాబ్ రాష్ట్రంలో  జలంధర్ లో ఒక పాస్ పోర్ట్ కేంద్రంలో 241 మంది పాస్‌పోర్ట్ కోసం వచ్చారు. వీరిలో కొత్త పెళ్లి కూతుళ్ళు ఉన్నారు.

 

ఎన్నారైలను పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడాలి అని కొరిక ఉన్న వారు అని అందుకే వాళ్ళు వచ్చారని, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వారు అందరూ వచ్చారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. అయితే ముందుగా పాస్ పోర్ట్ ఆఫీస్ లో వెళ్లిన ఇద్దరు అమ్మాయిలకి టికెట్లు కన్ఫర్మ్ అవటంతో టైం అయిపోతున్న తరుణంలో ఆఫీస్ సిబ్బందిపై గొడవకు దిగారట. కాగా కరోనా కారణంగా 50 శాతం సిబ్బందిని మాత్రమే అనుమతి ఇవ్వటంతో చాలావరకు పాస్ పోర్ట్ ఆఫీస్ లలో పనులు నత్తనడకన జరుగుతున్నాయట. దీంతో ఈ అమ్మాయిలకు పెళ్లి విషయంలో ఓపిక లేక ఆ సిబ్బందిపై తమ ఫ్రస్టేషన్ చూపిస్తూ పోరాటానికి తెగబడినట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: