భారత్ చైనా వివాదం గురించి ప్రపంచ దేశాలలో చర్చ జరుగుతోంది. అమెరికా భారత్ చైనా వివాదంను పరిష్కరిస్తామని చెబుతున్నా మోదీ సర్కార్ అందుకు అంగీకరించడం లేదు. ఇరు దేశాల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ వ్యాఖ్యలు చేయగా భారత్ ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించింది. ఒక రకంగా మోదీ సర్కార్ ట్రంప్ కు చిన్నపాటి షాక్ ఇచ్చింది. 
 
భారత్ చైనా సరిహద్దు వివాదం అంశాన్ని చర్చల ద్వారా లేదా శాంతియుత పద్ధతుల ద్వారా పరిష్కరించుకుంటామని అందువల్ల ఈ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భారత్ స్పష్టం చేసింది. భారత్ ఈ వివాదం ముదిరితే దౌత్యపరమైన మార్గాల సమస్యను పరిష్కరించి చైనాను దెబ్బ కొట్టాలని భావిస్తూ ఉండటం గమనార్హం. భారత్ చైనాతో స్వయంగా చర్చలు కొనసాగిస్తూ ఉండటంతో అమెరికా జోక్యం అవసరం లేదని పేర్కొంది. 
 
భారత్ చైనా వివాదానికి సంబంధించిన సరిహద్దుల అంశం గురించి పలు కీలక ఒప్పందాలు జరిగాయని... ఆ ఒప్పందాలకు అనుగుణంగా భారత్ ఉందని..... దేశ బలగాలు ఎల్లవేళలా శాంతియుతంగానే వ్యవహరిస్తున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. గత 20 రోజులుగా చైనా బలగాలు లదాక్, సిక్కిం సరిహద్దు ప్రాంతాల దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. 
 
దర్బూక్ - షోయక్ - దౌలత్ బేగ్ ఓల్డీ(డీబీఓ) మధ్య నిర్మించిన రోడ్డుపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యకం చేస్తోంది. లదాక్ లోని పాంగాంగ్ సరస్సు, సిక్కింలోని నాథులా ప్రాంతాలలో భారత్ బలగాలను అడ్డుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. చైనా యుద్ధానికి సిద్ధమవుతోంటే భారత్ మాత్రం శాంతియుతంగా సమస్య పరిష్కారానికి మొగ్గు చూపుతోంది. అంతర్జాతీయ సమాజంలో ఒంటరైపోయిన చైనాతో శాంతి మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని మోదీ సర్కార్ పేర్కొనగా చైనా ఈ విషయం గురించి స్పందించాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: