కరోనా ఈ పేరు చెబితే నిన్న మొన్నటి వరకు అందరిలో భయం.. కానీ ఇప్పుడు ఆకలి భయం కంటే కరోనా పెద్ద రాక్షాసి ఏం కాదు అనే విశ్వాసం.. కాగా ఇప్పుడున్న పరిస్దితుల్లో ఎలాగైనా చావడమో, కష్టాలు అనుభవించడమో అలవాటు చేసుకోవాలి.. ఎందుకంటే బయటకు వెళ్లితే కరోనా సోకుతుందేమో అనే భయంతో ఇంట్లో ఉంటే కడుపు నిండదు.. ఇప్పుడున్న పరిస్దితుల్లో పేద, మధ్యతరగతి జీవితాలు గాల్లో పెట్టిన దీపాలవంటివి.. ఈ పరిస్దితుల్లో బ్రతకడం అంటే కత్తి మీద సాము చేయడమే..

 

 

ఇకపోతే తెలంగాణలో కొత్తగా 117 కరోనా కేసులు వెలుగు చూశాయి. స్థానికంగా 66 పాజిటివ్ కేసులు నమోదవగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో 51 మందికి కరోనా సోకినట్టు తేలింది. అందులో సౌదీ అరేబియా నుంచి వచ్చిన 49 మందికి కరోనా నిర్ధారణ అవగా, ఇద్దరు వలస కార్మికులు కూడా కరోనా బారినపడ్డారు. ఇదిలా ఉండగా ఈ కరోనా ఏంచక్కా ప్రపంచం మొత్తం చుట్టేసిందన్న విషయం తెలిసిందే.. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 59 లక్షల 4 వేల 397 మందికి పైగా ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 29 లక్షల 62 వేల 865 కాగా ఈ వైరస్ వల్ల ఇప్పటివరు 3 లక్షల 61 వేల 998 మంది వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా మరణించారు..ఇక 25 లక్షల 79 వేల 534 మంది వరకు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

 

 

ఇక ప్రస్తుతం ఈ వైరస్ మూలంగా అగ్రరాజ్యం అయినా అమెరికా అతలాకుతం అవుతుంది. ఎక్కువగా కరోనా కేసులు ఇక్కడే నమోదు అవుతున్నాయి. ఆ లెక్కలు ఏంటంటే. ప్రస్తుతం వరకు 1,03,330 మంది అమెరికాలో ఈ వైరస్ వల్ల చనిపోయారు. ఇక కోవిడ్‌-19 కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన వివిధ దేశాల వివరాలు చూస్తే. రష్యా-4,142, బ్రెజిల్‌-26,764, యూకే-37,837, స్పెయిన్‌-27,119, ఫ్రాన్స్‌- 28,662, ఇటలీ-33,142, జర్మనీ-8,570, టర్కీ-4,461, ఇరాన్‌-7,627, పెరూ-4,099, కెనడా-6,877, మెక్సికో-9,044, చైనా-4,634, పాకిస్థాన్‌-1,260, బెల్జియం-9,388, నెదర్లాండ్స్‌- 5,903, స్వీడన్‌- 4,266, ఈక్వెడార్‌-3,313, పోర్చుగల్‌-1,369, స్విర్జర్లాండ్-1,919, ఐర్లాండ్‌-1,639, ఇండోనేషియా-1,496, పోలాండ్‌-1,038, రోమేనియాలో 1,235 మంది చనిపోయారు..

 

 

ఇప్పుడున్న పరిస్దిని బట్టి చూస్తే ఇప్పట్లో దీన్ని అంతం చేయలేమా అనే భయం ప్రజల్లో కనిపిస్తుందట.. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చే వరకు ఇంకెన్ని ప్రాణాలు పోవాలో, ఎన్ని జీవితాలు రోడ్దున పడతాయో తెలియదు.. మొత్తానికి ప్రపంచానికి కరోనా అనేది గురువులా భావించాలో లేక రక్కసి అనుకోవాలో అర్ధం అవడం లేదంటున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: