కరోనా వైరస్ పెడుతున్న కంగారు అంతా ఇంతా కాదు. ఈ వైరస్ మహమ్మారి దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. దేశంలోని ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి కారణంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారే. కరోనా కు ఇప్పటి వరకు వ్యాక్సిన్ కనిపెట్టలేక పోవడంతో లాక్ డౌన్ పేరుతో జనాల రాకపోకలను కట్టడి చేయాలని కేంద్రం భావించింది. మిగతా దేశాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తుండడంతో కేంద్రం కూడా రంగంలోకి దిగి దేశ వ్యాప్తంగా మార్చి 24 వ తేదీ నుంచి లాక్ డౌన్ ను అమల్లోకి తెచ్చారు. ఇక అప్పటి నుంచి విడతలవారీగా పొడిగించుకుంటూ వస్తున్నారు. ఈ నెల 31వ తేదీతో నాలుగో విడత లాక్ డౌన్ ముగుస్తుంది. కానీ ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య అదుపులోకి రాకపోవడం, నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండడం, లాక్ డౌన్ నిబంధనలు కారణంగా, జనజీవనం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి పరిణామాలతో లాక్ డౌన్ ను మరికొంతకాలం పొడిగించాలా లేక మినహాయింపులు ఇవ్వాలా అనే విషయంలో కేంద్రం కూడా ఎటు తేల్చుకోలేక పోతోంది. 

 

ఇప్పటికే అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ మేరకు మూడో విడత దగ్గర నుంచి అనేక సడలింపు లను కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చాయి. ఫలితంగా కేసుల సంఖ్య మరింతగా పెరగడం కేంద్రానికి ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ఈనెల 31తో ముగిసే లాక్ డౌన్ విషయం ఏం చేయాలనే విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్లు చేసి ముఖ్యమంత్రులు అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

 

IHG

 లాక్ డౌన్ ను పొడగించాలా వద్దా ? ఒకవేళ పొడిగిస్తే ఎటువంటి మినహాయింపు ఇవ్వాలి ? దీనిపై మీరేమనుకుంటున్నారు ? అనే విషయాలను ఆరా తీసినట్లు తెలుస్తోంది. మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పొడిగిస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయని, కాకపోతే ఆర్థిక కార్యకలాపాలకు ఎక్కడ నష్టం కలగకుండా మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కేంద్ర కేబినెట్లో చర్చించి తగిన నిర్ణయం తీసుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: