సాధారణంగా ప్రకాశం జిల్లా అనేది తెలుగుదేశం పార్టీకి అంత బలమైన జిల్లా మాత్రం కాదు అనే చెప్పాలి. 2004 ఎన్నిక‌ల నుంచి ఇక్క‌డ టీడీపీ ప‌ట్టు కోసం ఉనికి పాట్లు పడుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే 1999 ఎన్నిక‌ల నుంచే ఇక్క‌డ టీడీపీ వీక్ అవుతూ వ‌స్తోంది. 2004, 2009 ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒకే ఒక్క సీటుతో స‌రిపెట్టుకున్న టీడీపీ 2014లో మాత్రం ముక్కి మూలిగి ఐదు చోట్ల గెలిచింది. అయితే మొన్న‌టి ఎన్నిక‌ల్లో అనూహ్యంగా నాలుగు చోట్ల విజ‌యం సాధించింది. ఇంత వ్య‌తిరేక‌త‌లోనూ ఆ జిల్లాలో మాత్రం గత ఎన్నికల్లో 4 స్థానాల్లో పార్టీ విజయం సాధించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. జిల్లాలో పార్టీ కి అంత బలం లేకపోయినా సరే బలమైన నాయకత్వం ఉండటం కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు. 

 

అయితే ఇప్పుడు పార్టీ విషయానికి వస్తే... జిల్లాలో పార్టీని దాదాపుగా మంత్రి బాలినేని నిర్వీర్యం చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అవును టీడీపీలో బలమైన నాయకులు అందరూ కూడా ఆయనతోనే టచ్ లో ఉన్నారని సమాచారం. చంద్రబాబుతో దశాబ్దాలు గా ప్రయాణం చేసిన ఒక మాజీ మంత్రి ఎప్పుడు కుదిరితే అప్పుడు వైసీపీలోకి వెళ్ల‌డానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే మంత్రి మాత్రం కొంచెం ఆగాలి అని చెప్తున్నారట. గొట్టిపాటి రవికుమార్ కూడా త్వరలోనే జగన్ కి జై కొట్టే అవకాశం ఉందని సమాచారం. 

 

ఆయన ముందే జగన్ తో కలవాలి అని భావించినా సరే కరణం కుటుంబం కాస్త వేగంగా వెళ్ళింది. ఇప్పుడు మరో ఇద్దరు మాజీ ఎంపీలు కూడా చంద్రబాబు కి గుడ్ బై చెప్పడానికి సిద్దమయ్యారని సమాచారం. త్వరలోనే అన్నీ అనుకున్నట్టు జరిగితే గొట్టిపాటి పార్టీ మారే అవకాశం ఉందని సమాచారం. ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యూహాలతో చంద్రబాబు బాగా ఇబ్బంది పడుతున్నారని, ఆయన గుంటూరు జిల్లా నాయకులను కూడా టార్గెట్ చేసారట.

మరింత సమాచారం తెలుసుకోండి: