ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా వైరస్ పట్టి పీడిస్తుంది.. దీంతో మనుషు ప్రాణాలు మాత్రమే కాదు.. ఆర్థిక, వాణిజ్య, విద్యా వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి.  ఫిబ్రవరిలో కరోనా కేసులు పెరుగుతూ రావడం.. మార్చిలో లాక్ డౌన్ ప్రకటించడం.. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది.  అయితే మార్చిలో జరగాల్సిన పదవతరగతి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి. ఇక స్కూల్స్ ఇప్పట్లో తెర్చుకుంటాయా? ఒకవేల తెరుచుకున్నా.. తల్లిదండ్రుల పిల్లల్ని స్కూల్స్ కి పంపుతారా లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇక కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పాఠశాలలను దశల వారీగా తెరవాలని విద్యాశాఖ యోచిస్తోంది. జులై 5వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నందున ఆ తర్వాతే పాఠశాలలు తెరవాలని భావిస్తున్నారు. ఒకేసారి కాకుండా మొదట 8, 9, 10 విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని భావిస్తోంది.

 

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేటి మధ్యాహ్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశమై విద్యాసంవత్సరాన్ని ఎప్పుడు ప్రారంభించాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అంతే కాదు.. పాఠశాలల ప్రారంభంపై  రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) వ్యూహాపత్రాన్ని రూపొందించింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ నిన్ననే దీనిపై విద్యాశాఖ అధికారులతో చర్చించారు. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) మార్గదర్శకాల తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

 

లాక్ డౌన్ సడలించిన నేపథ్యంలో కేసులు మరింత పెరిగే అవకాశం ఉందన్న కోణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంపై చర్చలు కొనసాగినట్లు సమాచారం. అలాగే, స్కూళ్ల పునః ప్రారంభంపై మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సలహాలను కూడా తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారు.  విద్యార్థుల మధ్య భౌతిక దూరం, ఇంటర్వెల్, లంచ్ ఒక్కో తరగతికి ఒక్కోలా ఉండాలి. అలాగే, స్కూలు ముగిసిన తర్వాత ఒక్కో తరగతి విద్యార్థులను కొంత వ్యవధి తర్వాత విడిచిపెట్టాలి. అలాగే, విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్, మాస్కులు తప్పనిసరని విద్యాశాఖ తన ప్రణాళికలో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: