కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం వరుసగా లాక్ డౌన్ పొడిగిస్తూ  వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో నాలుగో విడత లాక్ డౌట్  కొనసాగుతోంది. మొదటి రెండు విడుదల లాక్ డౌన్ లో సంపూర్ణ నిబంధనలతో లాక్ డౌన్  విధించింది కేంద్ర ప్రభుత్వం. ప్రజలెవరూ కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రాకూడదు అని పూర్తిగా కార్ఫ్యు విధించింది. అయితే సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగించే సమయంలో వైరస్ కాస్త కంట్రోల్ లోనే ఉన్నప్పటికీ... ఆ తర్వాత కాలంలో మాత్రం వైరస్ విజృంభణ భారీగా పెరిగిపోయింది. వైరస్ పెరుగుతున్న సమయంలోనే లాక్ డౌన్ సడలింపు ఇవ్వటం కూడా వైరస్ వ్యాప్తికి మరింత కారణం  అయిపోయింది. కాగా ప్రస్తుతం దేశంలో నాలుగో విడత లాక్ డౌన్  కొనసాగుతోంది. 

 

 దాదాపుగా 90% సడలింపులు ఇవ్వగా కొన్ని నిబంధనలు మాత్రమే ప్రస్తుతం అమలులో ఉన్నాయి. అయితే మొదటి రెండు విడతల లాక్ డౌన్ వరకు కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ మూడోవిడత లాక్ డౌన్ నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి వారి అభిప్రాయాలను సేకరించి ఆ తర్వాత లాక్ డౌన్ పొడిగిస్తున్న  విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించిన నాలుగో విడత లాక్ డౌన్  మే 31 వరకు అంటే రేపటితో ముగియనుంది. అయితే లాక్ డౌన్ ముగుస్తుంది కానీ దేశంలో కరోనా  కేసుల సంఖ్య మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మే 31 తర్వాత లాక్ డౌన్ కొనసాగిస్తారా  లేదా ఎత్తివేస్తారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. 

 


 ఇక తాజాగా ఇదే విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మే 31 తర్వాత లాక్ డౌన్ ను పొడగించాలా  లేదా పూర్తిగా ఎత్తివేయాలా  అనే దానిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేషం  నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను సూచనలను సేకరించారు. ఇందులో కొంత మంది ముఖ్యమంత్రులు లాక్ డౌన్  పొడిగించేందుకు మొగ్గు చూపితే కొంతమంది మాత్రం ఎత్తివేయాలని మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరి దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకోబోతోంది  అన్నది రేపు తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: