సాధారణంగా రాజకీయ నాయకులు అంటే కఠినంగా ఉంటారని.. తమ స్వార్థం మాత్రమే చూసుకుంటారని.. ఐదేళ్లకొక్కసారి జనాలకు కనిపిస్తారని.. తర్వాత జనాల ముఖం కూడా చూడరని ఎంతో మంది అంటుంటారు.  సాధారణంగా ప్రతి కమర్షియల్ సినిమాల్లోనూ రాజకీయ నేతలను విలన్లుగానే చూపిస్తుంటారు.. అందుకే సామాన్య జనాలకు కూడా రాజకీయ నాయకులపై అలాంటి అభిప్రాయాలు ఉంటాయి.  కానీ రాజకీయ నేతల్లో వెన్నెలాంటి మంచి మనసు ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు.. కష్టం వస్తే అవసరమైతే తాము రంగంలోకి దిగి వారి కష్టాన్ని దూరం చేయడానికి ప్రయత్నించేవారు ఉన్నారు. తమ అభిమానులకు, కార్యకర్తలకు ఏ చిన్న ఆపద వచ్చినా  ముందుండి ఆదుకునే వారు ఉన్నారు.

 

అసలు దేశాన్ని ఇంత సమర్థవంతంగా పాలన చేస్తున్న రాజకీయ నాయకుల్లో అందరూ దుర్మార్గలైతే ఏనాడో బ్రష్టుపట్టిపట్టేదని అనేవారు కూడా ఉన్నారు.  తాజాగా రాజకీయ నాయకులు అధికారులపై అజమాయిషి చెలాయిస్తారని అనుకుంటాం. కానీ తమిళనాడులోని విద్యాశాఖ మంత్రి  కేఏ సెంగోట్టయన్‌ మాత్రం అలా కాదు. తన పేషీలో పని చేసే అధికారుల పని తీరుతో ముగ్ధుడైపోయారు. అంతే కాదు.. ఇక తన శాఖ కోసం కష్టపడిన కొంత మంది అధికారులు త్వరలోనే పదవి విరమణ పొందబోతున్నారని తెలిసి కంటతడి పెట్టుకున్నారు.

 

తనతో పనిచేసిన వారు ఎంతో గౌరవమైన వ్యక్తులని.. నిస్వార్థపరులని అలాంటి వారు దూరం కావడం ఇబ్బందిగా ఉందని ఆయన వాపోయారు. సభా కార్యక్రమంలోనే ఆయన తన బాధను వెల్లడించారు. వెంటనే అక్కడ ఉన్నవారంతా మంత్రిని సముదాయించడంతో తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు. పాఠశాల విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేలా మంత్రి కొన్ని చర్యలు చేపట్టారు. తరగతి గదిని ప్రతి విద్యార్థి అర్ధం చేసుకునే విధంగా  ‘వగుప్పరై నోక్కిన్‌’ అనే మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. దీన్ని పరిచయం చేస్తూ అధికారుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు తనతో కలిసి పని చేసిన కొంత మంది అధికారులు ఈ నెలాఖరులో పదవీవిరమణ చేయనున్నారని గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. ఇక విద్యాశాఖలో మార్పుల కోసం ప్రభుత్వం రూ. 34 వేల కోట్లను కేటాయించిందన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: