దేశంలో ఇప్పుడు కరోనా వైరస్ తో తల్లడిల్లిపోతున్నారు.. ఇది చాలదన్నట్టు రైతులకు కంటిమీద కునుకు లేకుండా పంటలపై మిడతల దాడి మొదలైంది.. అదీ చాలదన్నట్లు జనావాసాల్లోకి చిరుతలు రావడం దాడులు చేయడం జరుగుతుంది.  అయితే ఇప్పటి వరకు చిరుతల దాడుల్లో మనుషులు ప్రాణాలు పోలేదు.. కానీ తీవ్ర గాయాలు మాత్రం అయ్యాయి.  సాధారణంగా మనిషి పాము అన్నా.. కృరమృగాలన్నా ఎంతో భయపడిపోతారు.  అలాంటిది ఈ మద్య వరుసగా తెలంగాణలో పలు చిరుతలు ఎంత హడావుడి చేశాయో తెలిసిందే. గత కొన్ని రోజులుగా దొరకకుండా తిరుగుతున్న చిరుతపులి ఆచూకీ లభించింది. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ పరిసరాల్లో గురువారం రాత్రి కనిపించింది. దీంతో వ్యవపాయ వర్సిటీ సమీపంలోని అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు.

IHG

అయితే అటునుంచి నుంచి గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రంవైపు వెళ్లిందనే సమాచారంతో చిరుతకోసం చిరుతపులి కోసం అటవీశాక సిబ్బంది, పోలీసులు గాలిస్తున్నారు. గురువారం సీసీటీవీలో నమోదుకావడంలో ఆయా ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యవసాయ వర్సిటీ పరిసర ప్రాంతాల ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండల్ గ్రామ శివారులో చిరుతపులి స్థానికుల్ని హడలెత్తించింది. తొనిగండల్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సూరన్న గారి భూపాల్‌కు గ్రామ శివారులో తన గొర్రెల మందకు కొట్టం ఏర్పాటు చేసుకున్నాడు.  

IHG

తెల్లవారుజామున కొట్టంలోకి వెళ్లి చూడగా ఓ గొర్రె చనిపోయి ఉండగా మరో రెండు గొర్లు కొన ఊపిరితో రక్తపు మడుగులో పడి ఉన్నాయి. వెంటనే గ్రామస్తులకు తన గొడు వెల్లబోసుకున్నాడు. గ్రామ సర్పంచ్ విషయం చెప్పగా, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ మండలం రాజాపేట తాండాలోని ఓ పొలంలో పోలీసులను రెండు గంటల పాటు ముప్పుతిప్పలు పెట్టిన చిరుతను ఎట్టకేలకు బందించి హైదరాబాద్‌లోని జూపార్క్‌కు తరలిస్తుండగా మృతి చెందింది. ఇక ఎలుగు, తోడేళ్లు, నక్కలు సైతం గ్రామాల్లోకి వస్తున్నాయి ప్రజలు బాధపడిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: