బాలయ్య బాబు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సమావేశం గురించి చేసిన వ్యాఖ్యలు ఎటొచ్చీ ఆయన బావగారు టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద దెబ్బ పడేటట్లే చేస్తున్నాయి. ఇటీవల చిరంజీవి ఇంటిలో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఇండస్ట్రీలో ఉన్న పెద్దలతో సమావేశం అవ్వడం మనకందరికీ తెలిసినదే. అయితే జరిగిన ఈ సమావేశానికి తనకి ఇండస్ట్రీ నుండి పిలుపు రాలేదని బాలయ్య బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా హైదరాబాద్ లో భూములు పంచుకోవడం కోసం సమావేశం జరిగింది అన్నట్టు వ్యాఖ్యలు చేశారు.

 

దీంతో బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం మరియు జనసేన పార్టీ ల మధ్య పెద్ద గందరగోళానికి దారి తీసింది. కేవలం బాలయ్య బాబు వ్యక్తిగత దూషణలకు కాక చిరంజీవి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి విమర్శించినట్లుగా జనసేన పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల చంద్రబాబుకే భారీ డామేజ్ అయ్యే అవకాశం ఉంది అని పలువురు మేధావులు విశ్లేషిస్తున్నారు. బాలయ్య వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి కాపు సామాజిక ఓటుబ్యాంకు దూరమయ్యే అవకాశం ఉంది అని అభిప్రాయపడుతున్నారు.

 

సినిమా ఇండస్ట్రీ పరంగా చూసినా అదేవిధంగా రాజకీయ పరంగా చూసిన చంద్రబాబు కి బాలయ్య తాజాగా చేసిన ఘాటు వ్యాఖ్యలు భవిష్యత్తులో భారీ డ్యామేజ్ తీసుకొచ్చే అవకాశం ఉందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియాలో ఖండిస్తున్నారు. మరోపక్క ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరచడం కూడా ఒకవిధంగా చంద్రబాబును ఇరుకున పెట్టినట్లే అన్ని, బాలయ్య లూజు టాక్ వల్ల చంద్రబాబుకి మరిన్ని తిప్పలు రాబోయే రోజుల్లో ఎదుర్కోవటం గ్యారెంటీ అని పలువురు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు ఎటునుంచి చూసినా చంద్రబాబుకే భారీ దెబ్బ పడే అవకాశం ఉందన్న టాక్ బలంగా వినబడుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: