వైయస్ జగన్ ముందు నుండి తన పరిపాలనలో ఎక్కడ కూడా అవినీతి లేకుండా చాలా వరకు ప్రభుత్వ అధికారులతో గ్రామ వాలంటీర్, వార్డు సచివాలయ సిబ్బందితో పనులు కానిచ్చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాడే పై స్థాయి నుండి కింద స్థాయి వరకు ఎక్కడ అవినీతి లేకుండా చేస్తానని హామీ ఇవ్వటం మనకందరికీ గుర్తే. జనరల్ గా అయితే పొలిటికల్ లీడర్లు అధికారంలోకి వచ్చిన వెంటనే పదవులు ఆశించడం తరువాత ఇక పూర్తిగా డబ్బులు సంపాదించడం వాటిపైనే దృష్టి పెడతారన్న విషయం అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వంలో ఇదే జరిగింది. అవినీతి నాయకులను ఎంతో కంట్రోల్ చేసే చంద్రబాబు తన హయాంలో చివరి రెండు సంవత్సరాలలో చేతులెత్తేయడంతో పార్టీ నాయకులు రెచ్చిపోవడం జరిగింది. దీంతో రాష్ట్రంపై భారీ అవినీతి మరకలు పడ్డాయి.

 

ఫలితం ప్రజలంతా 2019 ఎన్నికల్లో ఘోర ఓడించి ఇంటికి పంపించడం జరిగింది. అయితే ఇటువంటి పరిస్థితి తన పార్టీలో రాకుండా ఉండాలని జగన్ ముందు నుండి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా కొంత మంది మంత్రులు చేస్తున్న అత్యుత్సాహంతో ఫిర్యాదులు రావడంతో జగన్ సదరు మంత్రులపై అనుమానిస్తూ నిఘా పెట్టినట్లు  పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో ఆయా మంత్రులను జగన్ ఫ్రీగానే వదిలేయటం జరిగింది. ఈ సమయంలో కీలక శాఖకు సంబంధించి ఇద్దరు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు డైరెక్ట్ గా జగన్ కే రావడంతో పైగా వారు మహిళా మంత్రులు కావటంతో జగన్ అలర్ట్ అయ్యారు అంట.

 

గుంటూరు జిల్లా మరియు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఇద్దరు మంత్రుల శాఖ‌ల్లో వారి ప‌తులు చ‌క్రం తిప్పుతున్నార‌ని సమాచారం రావడంతో నే జగన్ త‌న‌కు అత్యంత విశ్వాస పాత్రులుగా ఉన్నవారిని తెచ్చి.. ఆయా శాఖ‌ల‌కు పీఆర్వోలుగా, ముఖ్య కార్యద‌ర్శులుగా నియ‌మించార‌ట‌. ఈ పరిణామంతో సదరు మంత్రులు ఇప్పుడు అడుగు ఎటు తీసి ఎటు వేయాల‌న్నా కూడా హ‌డ‌లి పోతున్నార‌ని, వారు ఏం చేసినా క్షణాల్లోనే జ‌గ‌న్‌కు స‌మాచారం వెళ్తోంద‌ని వైసీపీలో చ‌ర్చ జరుగుతోంది. అంతే కాకుండా ఆ మంత్రులకు సంబంధించి సమీక్షలు కూడా సీఎం జగన్నే పర్యవేక్షిస్తున్న ట్లు పార్టీలో టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: