తెలంగాణ పోరాట యోధుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి చెబుతున్న మాటే.. మన నేల.. మన భూమి.. మన నీళ్లు.. ఇది రైతు రాజ్యం.  ఈ నేపథ్యంలోనే ఆయన ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి రైతు భూములను సస్యశ్యామలం చేసే పనిలో ఉన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి.. ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగమైన తుది పంపు హౌజ్ మర్కూక్ పంపు హౌజ్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మెతుకు సీమను సస్యశ్యామలం చేసేందుకు కొండపోచమ్మ సాగర్ ను సీఎం ప్రారంభించి.. గోదావరి జలాలకు హారతి పట్టారు. రైతులకు సాగునీరు అందిస్తున్న కేసీఆర్ పై రాష్ర్ట వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.  కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.

 

 కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోయిన భూ నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ వరకు కోల్పోయిన భూనిర్వాసితులకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి త్యాగం వల్లే లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయి. తెలంగాణలో ప్రతి రైతూ ప్రశాంతంగా గుండెమీద చేయి వేసుకొని నిద్రపోవాలి.. లక్షాది కారవాలి అన్నదే నా కల అన్నారు.  నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివి. మంచి నష్ట పరిహారం ఇచ్చాం. అన్ని విధాలా వారికి ప్రభుత్వం అండదండగా ఉంటుంది.

 

భూ నిర్వాసితుల త్యాగాలు గుర్తు చేసుకోకుండా ఉండలేమని సీఎం స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు అతి పెద్దది. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రాజెక్టు అని సీఎం తెలిపారు. 165 టీఎంసీల కెపాసిటీతో కొత్త రిజర్వాయర్‌లు నిర్మించాం. ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టులను ఏ రాష్ట్రం కూడా నిర్మించలేదు అన్నారు. ఒకనాడు ఏడుపు పంటల తెలంగాణ.. నేడు పసిడి పంటల తెలంగాణగా మారింది అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: