చిరంజీవి ఆధ్వర్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు త్వరలో సినిమా షూటింగ్ లు  ప్రారంభించడానికి ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తో చర్చలు జరిపిన చిరంజీవి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలోనే ఈ భేటీ గురించి సోషల్ మీడియాలో చిరంజీవి చెప్పటం విధితమే. అయితే తాజాగా ఈ ఇద్దరి బేటీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలియవచ్చింది. జూన్ 1వ తారీకు సాయంత్రం భేటీ ఉంటుందని ఈ మేరకు సీఎం ఓ ఆఫీస్ నుండి మెగాస్టార్ కి కబురు అందిందని సమాచారం. వాస్తవానికి అంతకుముందే వీరిద్దరి బేటి జరగాల్సి ఉన్నప్పటికీ వైయస్ జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మేధోమథనం సదస్సులో భాగంగా 'మన పాలన మీ సూచన' లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 

ఈ నెల ఆఖరి వరకు ఈ కార్యక్రమాలు ఉన్నాయి. అందుకే జూన్ మొదటి తారీఖున బేటీ కుదిరినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా గత కొంత కాలం నుండి ఫిల్మ్ ఇండస్ట్రీ తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అయ్యాయి. ఈ పరిణామంతో చిత్ర పరిశ్రమ రెండుగా చీలి పోనుందా ? ఏపీకి తరలిపోనుందా? అనే అనుమానాలు చాలానే వ్యక్తమయ్యాయి. కానీ సినిమా ఇండస్ట్రీ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో షూటింగులు జరుపుకుంటూ వస్తోంది.

 

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో స్టూడియోలు,ల్యాబ్ లు ఇళ్ల స్థలాలు పొందిన చిత్రపరిశ్రమ, ఆంధ్రాలో కూడా తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్ . ఈ సందర్భంగా చిరంజీవి ఈ విషయం గురించి జగన్ తో జూన్ మొదటి తారీఖున అన్ని విషయాలు చర్చించనున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. అలాగే ఏపీ సీఎం జగన్ కూడా ఆంధ్రాలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఎక్కువ ప్రోత్సాహం చూపించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అందువల్లనే సినిమా మరియు సీరియల్ షూటింగ్ లకు సంబంధించి మొదటిగా స్పందించి సింగల్ విండో లోనే అనుమతులు ఇచ్చారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: