తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్నేళ్లపాటు హీరోయిన్ రాణించి ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించింది అర్చన. తన అందాలతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించింది. అప్పట్లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకున్న ఈ అమ్మడు... టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కూడా కాలం గడిపింది. ఆ తర్వాత ఎన్నో సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించి ఆకట్టుకుంది అర్చన. ఎన్నో ఆధ్యాత్మిక సినిమాల్లో కూడా నటించి తనదైన అభినయంతో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత టాలీవుడ్లో బిగ్గెస్ట్ రియాలిటీ షో గా వచ్చిన బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో కంటెస్టెంట్ గా వచ్చి మరింత గుర్తింపు సంపాదించింది అర్చన. తన అందం అభినయం నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 

 

 మరో వైపు హాట్ ఫోటో షూట్లతో కూడా సోషల్ మీడియాలో ఎంతగానో హీట్ పుట్టించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా దర్శక నిర్మాతలు మాత్రం అర్చన వైపు అంతగా ఆసక్తి చూపలేదు.ఇక టాలీవుడ్ లో సినిమా అవకాశాలు కూడా అంతగా లేకపోవడంతో ఇటీవలే పెళ్లి చేసుకుని సెటిలైంది అర్చన. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తి స్థాయిలో గుడ్ బాయ్ చెప్పేసింది ఈ బ్యూటీ. ప్రముఖ హెల్త్ కేర్ కంపెనీ చైర్మన్ జగదీశ్ భక్తవత్సలం ను పెళ్లి చేసుకుంది. తాజాగా తన భర్త గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది అర్చన. 

 

 తన భర్త ఎప్పుడు చూసినా ఫోన్ పేకాట ఆడుతూ ఉంటారు అని... ఈ విషయం తనకు ఎప్పుడూ కోపం తెప్పిస్తూ  ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది అర్చన . అంతేకాకుండా తన భర్త బాత్రూం లోకి వెళ్తే గంటల తరబడి బయటకు రాడని.. బాత్రూంలో అంతలా ఏం చేస్తాడో అర్థం కాదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇలా గంటల తరబడి బాత్రూంలో ఉండటం తనకు ఎంతో చిరాకు తెప్పిస్తుంది అంటూ అర్చన తెలిపింది. అయితే పెళ్లికి ముందు తన భర్తకు ఈ అలవాట్లు ఉన్నాయి అని తనకు తెలియదు అంటూ చెప్పుకొచ్చింది అర్చన. అయితే తాజాగా తన భర్త గురించి అర్చన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: