తనను విమర్శించిన సామాజిక మాధ్యమాల ప్లాట్‌ఫామ్‌లను నియంత్రించే అసాధారణ ప్రయత్నంలో ట్విట్టర్, ఫేస్‌బుక్‌తో సహా ఇంటర్నెట్ సంస్థలను రక్షించే చట్టాన్ని రద్దు చేయడం లేకపోతే బలహీనపరచడానికి ఓ సరికొత్త చట్టాన్ని ప్రవేశపెడతామని అనే ఒక సంచలన నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే తీసుకున్నాడు. నిన్న అనగా గురువారం రోజు మధ్యాహ్నం డోనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో భాగంలో సోషల్ మీడియా సంస్థలను రక్షించే చట్టాన్ని రద్దు చేయాలనే ఓ ప్రతిపాదన కూడా ఉండటం ప్రస్తుతం అనేక వార్తలకు దారి తీస్తుంది. 


మెయిల్-ఇన్ ఓటింగ్ అవలంభించడం ద్వారా మోసం జరుగుతుందని ట్రంప్ చేసిన రెండు ట్వీట్లను ట్విట్టర్ సంస్థ ట్యాగ్ చేసి ట్రంప్ వ్యాఖ్యలలో నిజం ఎంత ఉందో తమ వినియోగదారులను తెలుసుకోవాల్సిందిగా కోరింది. ఇప్పటివరకు ట్రంపు చేసిన ట్వీట్లకు ట్విట్టర్ సంస్థ ఎటువంటి నియమ నిబంధనలను విధించలేదు. కానీ ఇటీవల ఏకంగా డోనాల్డ్ ట్రంప్ ని టార్గెట్ చేయగా... తాను ట్విటర్ సంస్థపై మండిపడ్డాడు. 


ఒక డ్రాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్, ఫేస్‌బుక్ తమ వినియోగదారులు పోస్ట్ చేసిన విషయాలకు బాధ్యత వహించకుండా ఉండేందుకు దీర్ఘకాలంగా రక్షించే ప్రస్తుత చట్టాన్ని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. కమ్యూనికేషన్స్ డీసెన్సీ చట్టం కింద 203 సెక్షన్ ప్రకారం నేతల స్వేచ్ఛాయుత మాటల లో జోక్యం చేసుకునే సోషల్ మీడియా పై చర్యలు తీసుకోవాల్సిందిగా ట్రంప్ ఆదేశించాడు. సోషల్ మీడియా ఇతరుల యొక్క మాటలలో జోక్యం చేసుకొని పక్కదారి పట్టించడం ఎంత మాత్రం సరికాదని ట్రంప్ అన్నాడు. 


ప్రస్తుతం ట్రంప్ ఆదేశాల ప్రకారం న్యాయవాదులు చట్టాలను సమీక్షించి సామాజిక మాధ్యమాలు న్యాయమైన మోసపూరితమైన చర్యలలో పాల్గొంటున్నారా లేదా అనేది తెలుసుకోనున్నారు. అలాగే మాట్లాడే హక్కులను సోషల్ మీడియా వెబ్సైట్స్ ఒత్తి పడుతున్నాయా అనేది కూడా అధికారులు తెలుసుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: