వైసీపీ పార్టీలో ముందునుండి ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా రోజా కి మంచి పేరు ఉంది. నటిగా మరియు టీవీ షోలలో వ్యాఖ్యాతగా చేస్తూనే మరోపక్క రాజకీయాలు చేస్తూ సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగిస్తోంది. వైసిపి పార్టీ నుండి రెండోసారి ఎమ్మెల్యేగా అయిన రోజా ఏపీఐఐసీ చైర్మన్ గా కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. అయితే ఇటీవల ఆమె ఎక్కువగా టీవీ షో ల పైన ఫోకస్ పెట్టినట్లు నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపై దృష్టి పెట్టడం లేదన్న కామెంట్లు, విమర్శలు నియోజకవర్గంలో వినపడుతున్న తరుణంలో రోజా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తన రూటు మార్చినట్లు సమాచారం. ఇక నుండి మొత్తం మీద టీవీ షోలకు వారంలో ఒకరోజు మాత్రమే కేటాయించి, మిగతా సమయాన్ని మొత్తం పొలిటికల్ గా బిజీ అవ్వాలని చూస్తున్నట్లు టాక్.

 

ఈ సందర్భంగా నియోజకవర్గంలో తాను అందుబాటులోకి లేకపోయినా గాని ఒక ఆఫీసును ఏర్పాటు చేసి అక్కడ ఒక బాధ్యుడని పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో ఎవరికి ఏదైనా సమస్య వస్తే ఈ ఆఫీసుకు వచ్చి చెప్పుకుంటే సరిపోతుందంటున్నారు. అంతేకాకుండా ఏపీఐఐసీ చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు సరైన కార్యక్రమాలు తన మార్క్ ఆలోచనలు ఉండేలా వ్యవహరించ లేని నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత సమయాన్ని ఏపీఐఐసీ మీద పెట్టాలని రోజా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

 

దీంతో ఈ విషయాలన్నీ జగన్ తెలుసుకుని రోజా తీసుకున్న నిర్ణయాల పై ప్రశంసలు కురిపించినట్లు వైసీపీ పార్టీలో టాక్.  మరోపక్క నెక్స్ట్ హాఫ్ టర్మ్  తరువాత రోజా మినిస్టర్ పదవికి కర్చీఫ్ వేయటానికి ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీలో కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా రోజా త్వరలో బుల్లితెరపై కంటే రాజకీయంగా బిజీ కాబోతున్నట్లు అర్థమవుతోంది. అంతేకాకుండా నగరి నియోజకవర్గ ప్రజలకు రోజా ఇక నుండి అందుబాటులోకి ఉండబోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: