ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. దీనితో చాలామందికి ఉపాధి కోల్పోవడంతో పాటు ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువ అయిపోయాయి. దీనితో వారు మనస్థాపానికి గురై కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలోనే తాజాగా ఒక వ్యక్తి ఉద్యోగం లేదన్న మనోవేదనతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

IHG'18, highest in 10 yrs - The ...


అతని భార్య ఒక లేడీ కానిస్టేబుల్. ఇక అప్పటి వరకు ఉద్యోగం సాఫీగా జరుగుతుండగా కరోనా వైరస్ దెబ్బకు ఉద్యోగం తొలగించడంతో మానసిక ఆందోళనతో కుంగిపోయాడు ఆ వ్యక్తి.  తన భార్యకు ఉద్యోగం చేస్తుండగా నేను ఖాళీగా ఉంటున్నాను అనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణమైన సంఘటన విశాఖపట్నం జిల్లా అనకాపల్లి లో జరిగింది. ఇక ఈ కేసులో పూర్తి వివరాల్లోకి వెళితే ... అనకాపల్లి పట్టణంలోని నరసింగ రావు పేటలో చిన్న రాజు, శ్యామల ఇద్దరు వారి వారి విధులతో జీవనం కొనసాగిస్తున్నారు.

 

భార్య శ్యామల కసింకోట పోలీస్ స్టేషన్ లో లేడీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుంది. భర్త మాత్రం ఒక షాపింగ్ మాల్ లో ఉద్యోగం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తాడు. ఇక లాక్ డౌన్  కారణంగా మాల్స్ అన్నీ కూడా మూతపడడంతో అతను ఖాళీగా ఉంటూ ఇంటికే పరిమితమయ్యాడు. దీనితో ఉద్యోగం కూడా పోవడంతో  చినరాజు తీవ్ర మనస్థాపంతో మనోవేదనకు గురయ్యాడు. ఉద్యోగం లేదు అన్న బాధతో అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి తండ్రి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయగా... వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: