హైకోర్టు తీర్పుతో జగన్ సర్కార్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ సర్కార్ జారీ చేసిన ఆర్డినెన్స్ ను రద్దు చేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల కమిషనర్ గా రమేశ్ కుమార్ కొనసాగాలని ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో జగన్ సర్కార్ కు భారీ షాక్ తగిలింది. జగన్ సర్కార్ ఆర్డినెన్స్ లో ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గించింది. కానీ హైకోర్టు మాత్రం ఆర్డినెన్స్ చెల్లదని పేర్కొని ఆ ఆర్డినెన్స్ ను రద్దు చేసింది. 
 
హైకోర్టు మళ్లీ నిమ్మగడ్డనే ఎన్నికల కమిషనర్ గా కొనసాగించమని ఆదేశించడంతో జగన్ సర్కార్ కు ఊహించని షాక్ తగిలింది. హైకోర్టు తీర్పుతో పదవీ కాలం పూర్తయ్యేంతవరకు ఆయనే కొనసాగనున్నారు. ఏదైనా పని చేయాలనుకున్న సమయంలో ప్రభుత్వం సరైన స్ట్రాటెజీతో ముందుకెళ్లాలి. న్యాయపరంగా చిక్కులు ఎదురు కాకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకుని చట్టాలు చేస్తే ఎదురుదెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
 
రాజ్యాంగబద్ధంగా ఏపీ సర్కార్ ముందుకెళ్లాలంటే అసెంబ్లీలో తీర్మానం చేయడం లేదా కేంద్రం తీర్మానం చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేయడం అంత తేలిక కాదు. నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేయడం... అనంతరం వైసీపీ నిమ్మగడ్డపై విమర్శలు చేయడం... ఆయా కేంద్రానికి రాసిన లేఖపై భారీ స్థాయిలో చర్చ జరగడం తెలిసిందే. మరోవైపు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ కు సుప్రీంకు వెళ్లనుందని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

 
జగన్ సర్కార్ కు సాంకేతిక కారణాల వల్ల తగిలిన ఎదురుదెబ్బ ఇది అని చెప్పవచ్చు. వరుసగా హైకోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా ముందుకెళ్లాల్సి ఉంది. జగన్ సర్కార్ కీలక నిర్ణయాల విషయంలో తప్పనిసరిగా న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సి ఉంది. వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలు ప్రభుత్వానికి నష్టం చేకూర్చే అవకాశం ఉన్నందున జగన్ సర్కార్ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: