ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా ఇప్పుడు బాలయ్య, చిరంజీవి మధ్య జరుగుతున్న వార్ లోకి తెలంగాణా సీఎం కేసీఆర్ ను లాగేశారు. కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో తెలుగు సినీ కార్మికులు కరోనా కారణంగా పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మెగా స్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పెద్దలను కలిసారు. ఈ సందర్భంగా తమ సినిమా కష్టాలను వారికి చెప్పుకున్నారు. టిఆర్ఎస్ పెద్దలను కలిసిన వారిలో చిరంజీవి, నాగార్జున తో పాటు కొంతమంది అగ్ర నిర్మాతలు, అగ్ర  దర్శకులు ఉన్నారు. ఈ వ్యవహారం ఇలా ఉంటే మహానాడులో పాల్గొన్న బాలకృష్ణ ను చిరు బృందం టీఆర్ఎస్ మంత్రిని కలిసిన విషయం గురించి ఈ సమావేశంలో విలేకరులు ప్రశ్నించగా, ఆ సినీ పెద్దలంతా మంత్రితో కలిసి భూములను పంచుకోవడానికి కలిసారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

IHG


దీనికి నాగబాబు బాలయ్య కు ఘాటుగానే కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో బాలయ్యను తప్పు పట్టే వారి సంఖ్య పెరుగుతోంది. కానీ బాలయ్య కూడా సీనియర్ నటుడు కావడంతో ఆయనను కూడా పిలిచి ఉంటే బాగుండేది అనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఇది చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ కాబట్టి, అందులోనూ బాలయ్య వర్సెస్ మెగా బ్రదర్స్ వార్ గతంలో నడిచిన నేపథ్యంలో పిలిచి ఉండకపోవచ్చు. అయినా దీనికి ఇప్పుడు చిరంజీవి సమాధానం చెప్పాలి. కానీ ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు. ఇప్పుడు ఈ వ్యవహారం తెలంగాణ సీఎం కేసీఆర్ ను చుట్టుకునేలా కనిపిస్తోంది. 

IHG


కెసిఆర్ ఆదేశాల మేరకు చిరంజీవి నాగార్జున లీడ్ తీసుకుని ఈ కమిటీని ఏర్పాటు చేసి పరిష్కార మార్గాలను వెతికే ప్రయత్నం చేస్తున్నారని, కేసీఆర్ చెబితే బాలయ్యను కూడా పిలిచి ఉండేవారమని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన మాటలను బట్టి చూస్తే పరోక్షంగా కేసీఆర్ పిలవాలి అని చెప్పలేదు కాబట్టి బాలయ్యను ఆహ్వానించలేదు, ఇందులో చిరంజీవి తప్పు గాని, తమ తప్పు కానీ ఏమి లేదు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. మంత్రితో కలిసి భూములు పంచుకుంటున్నారు అని బాలయ్య పరోక్షంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయడంతో కెసిఆర్ కానీ, ఆ పార్టీ నాయకులు అని దీనిపైన స్పందించే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: