ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ రాజకీయ  ప్రయాణంపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా జనసేన పార్టీ కొన్ని రోజులుగా బలపడాలంటే బిజెపిని అడ్డంగా పెట్టుకోవాల‌ని భావిస్తుంది అన్న చ‌ర్చ‌లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నా సరే క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు మాత్రం బిజెపి తో స్నేహం చేస్తున్నారు అనే విషయం అర్ధమవుతుంది. అస‌లు ఏపీలో కాస్తో కూస్తో బీజేపీ కంటే ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీకే ఓటు బ్యాంకు ఉంద‌ని చెప్పాలి. గ‌త ఎన్నిక‌ల్లో కూడా ఇది రుజువు అయ్యింది. మ‌రి ఈ టైంలో బిజెపి తో స్నేహం చేసినా సరే జనసేన కు అంతగా కలిసి వచ్చేది ఏమీ లేదు.

 

రాజకీయంగా పవన్ కళ్యాణ్ కి కలిసి వచ్చే పరిస్థితులు ఏమీ లేవు అనే చెప్పాలి. దీనితో ఇప్పుడు రాజకీయ పరిశీలకులు కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. జ‌న‌సేన కార్యకర్తలను, నాయకులను  పవన్ కళ్యాణ్ బిజెపి తో కలిసి వెళ్ళాలి అని సూచనలు చేస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ప‌రిశీల‌కు మాట‌లు ప‌వ‌న్ వింటున్నారు అని అంటున్నారు. క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన కేడ‌ర్ ని బిజెపి తో కలిసి పని చేసే విధంగా అయన ప్రోత్సాహం అందిస్తున్నార‌ట‌.

 

అయితే ఇక్క‌డే ఓ గంద‌ర‌గోళం కూడా విన‌ప‌డుతోంది. భవిష్యత్తులో బిజెపి తెలుగుదేశం తో కలిసి వెళ్ళే అవకాశం ఉందని, అప్పుడు కచ్చితంగా తెలుగుదేశం పార్టీ తో కలిసి వెళ్ళినప్పుడు సీట్లు తీసుకోవాలి అంటే ఇప్పుడు బిజెపి తో కలిసి నాయకులు పని చెయ్యాలని ఏదో అర్ధం కాని లాజిక్ ని పవన్ కళ్యాణ్ వారికి చెప్పినట్టు సమాచారం. బిజెపిని అడ్డం పెట్టుకుని సొంతగా జనసేన పైకి వస్తే మంచి లాభం ఉంటుంది అని పవన్ చెప్పారట. అంటే గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు బీజేపీ, టీడీపీకి జై కొట్టిన ప‌వ‌న్ ఎన్నిక‌ల‌కు ముందు ఆ రెండు పార్టీల నుంచి విడిపోయారు.

 

అలాంటి ప‌వ‌న్ ఇప్పుడు ఏపీలో జ‌నాలు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న బీజేపీతో ఎందుకు చెలిమి చేస్తున్నారు ?  మ‌ళ్లీ భ‌విష్య‌త్తులో టీడీపీతో అయినా క‌లిసేందుకు రెడీగా ఉండ‌డం ఏంటో ?  ప‌వ‌న్ స‌న్నిహితుల‌కే అర్థం కాలేద‌ట‌. ఏదేమైనా ప‌వ‌న్ క‌న్‌ఫ్యూజ్ రాజ‌కీయాలు కంటిన్యూ అవుతున్నాయ‌న‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: