ఆంధ్రప్రదేశ్ లో జగన్ సంక్షేమ కార్యక్రమాలు గాని జగన్ చేస్తున్న పరిపాలన గాని కొంత మందికి ఇబ్బందిగా మారింది అనేది వాస్తవం. వాస్తవ పరిస్థితులు చూస్తే కరోనాతో అన్ని రాష్ట్రాలు కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి అనేది వాస్తవం. లాక్ డౌన్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా ఆదాయం పడిపోయింది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. క‌రోనా దెబ్బ‌తో మ‌న దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ తీవ్రంగా అతలా కుత‌లం అయ్యింది. మ‌న దేశ జీడీపీ క‌రోనా దెబ్బ‌తో 11 ఏళ్ల క‌నిష్ట‌నికి ప‌డిపోయింది. దీనిని బ‌ట్టి ఎగుమ‌తులు, దిగుమ‌తుల‌తో పాటు జీడీపీ ఎంత ఘోరంగా దెబ్బ‌తిందో తెలుస్తోంది.

 

క‌రోనాతో దేశ‌మే అత‌లా కుత‌లం అవుతున్నా ... అయినా సరే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి ఆ విధంగా లేదు. జగన్ సర్కార్ సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గడ౦ లేదు. జగన్ ఇచ్చిన మాటను ముందుకు తీసుకుని వెళ్తున్నారు గాని... వెనక్కు తగ్గి అమలు చేయకుండా ఉండటం లేదు. మేధోమధన సదస్సుల సందర్భంగా ఆయన అనేక హామీలు ఇవ్వడమే కాకుండా ఆర్ధిక శాఖకు ఆదేశాలు కూడా ఇస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల‌కు జీతాలు స‌గం ఇస్తున్నా.. ఏపీలో మాత్రం పూర్తి స్థాయిలో ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు.

 

 ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా జీతాలు ఇచ్చిన సందర్భం లేదు అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు ఆర్ధిక కష్టాలు ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. మరి జగన్ ఏ విధంగా వీటిని అమలు చేస్తున్నారు అనేది అర్ధం కావడం లేదు. దీనిపై తెలంగాణా సహా కర్ణాటక ప్రభుత్వాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం ఈ పరిణామం ఆశ్చర్యంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: