రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కోర్ట్ తీర్పులను తనకు అనుకూలంగా మార్చుకోవాలి అని భావిస్తుందా...? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా కోర్టు తీర్పులు ప్ర‌భుత్వానికి కాస్త ఇబ్బంది గా మారాయ‌న్న‌ది మాత్రం వాస్త‌వం. అయితే అవి తెలుగుదేశ౦ పార్టీకి అనుకూలంగా మారాయా లేదా అనేది ఎవరికి కూడా అర్ధం కావడం లేదు. ఇక గత పది రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి.

 

ఇందులో కొన్ని విష‌యాల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం దూకుడుగా వెళితే వెళ్లి ఉండ‌వ‌చ్చు. అయితే చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో జ‌రిగిన అరాచ‌కాల గురించి అంతే లేదు. అయితే ఇవన్ని కూడా జనంలోకి ఒకరకమైన సంకేతాన్ని తీసుకుని వెళ్తున్నాయి అనేది రాజకీయ పరిశీలకుల మాటగా చెప్తున్నారు. అది ఏంటీ అంటే జగన్ సర్కార్ ని ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు కేంద్రం తో కుమ్మక్కు అయ్యిందా ? అంటు అవున‌నే సందేహాలు కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. వాస్త‌వంగా చూస్తే ఏపీ బీజేపీలో కొంద‌రు ఇప్ప‌ట‌కీ చంద్ర‌బాబు కోట‌రీ మ‌నుషులే అన్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

 

వీరి స‌హకారంతో చంద్ర‌బాబు ర‌క‌ర‌కాలుగా వ్య‌వ‌స్థ‌ల‌ను మెనేజ్ చేస్తున్నార‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లో ఉంది. ఇక చంద్ర‌బాబు అంటే వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేస్తార‌న్న టాక్ ఉంది. ఇప్ప‌ట‌కీ వ్య‌వ‌స్థ‌ల్లో ఆయ‌న‌కు ఉన్న పట్టుతోనే చంద్రబాబు ఇలాంటి వ్యవహారాలూ చేస్తున్నారు అని  ప్రజల్లోకి సంకేతాలు వెళ్తున్నాయి. అయితే మరికొందరు మాత్రం వ్య‌వ‌స్థ‌ల‌కు రాజకీయాలకు సంబంధం ఉండదు  అని... అనవసరంగా వ్య‌వ‌స్థ‌ల‌తో రాజకీయాలు వద్దని ప్రభుత్వం జాగ్రత్తగా ఉండటమే ప్రస్తుత పరిస్థితుల్లో మంచిది అని చెపుతున్నారు.

 

ఏదేమైనా ఒక్క‌టి మాత్రం నిజం. నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ అనే వ్య‌క్తి చంద్ర‌బాబు పాల‌న‌లో నియ‌మించిన అధికారే. పైగా చంద్ర‌బాబుతో ఆయ‌న‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌న్న టాక్ కూడా ఉంది. ఒక్క ర‌మేష్ కుమార్ మాత్ర‌మే కాదు... ఆయ‌న వ‌ర్గంగా ఉన్న అధికారులు.. బీజేపీలో ఉన్న ఆయ‌న కోట‌రీతో ఆయ‌న జ‌గ‌న్‌ను ర‌క‌ర‌కాలుగా ఇబ్బంది పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న‌ది నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: