ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సంబంధించి కీలకమైన హామీ ప్రత్యేక హోదా గురించి వైయస్ జగన్ ఇటీవల ‘మన పాలన మీ సూచన’ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చే ఏడాది కావస్తున్న తరుణంలో పారిశ్రామికవేత్తలతో జరిగిన భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగిందని అనటం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు కేంద్రం, రాష్ట్రం కలిసి కాపురం చేశాయని, అయినా ప్రత్యేక హోదా తెచ్చుకోలేకపోయారని చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆ తర్వాత ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు, 22 లోక్ సభ సీట్లు వచ్చాయని చెప్పుకొచ్చిన జగన్ కేంద్రంలో కూడా వారికి పూర్తి మెజార్టీ రాకుండా పోయి ఉంటే మనం ప్రత్యేక హోదా పై పట్టుబట్డానికి అవకాశం ఉండేదని పేర్కొన్నారు.

 

ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారితో నడవడానికి సిద్దమని కూడా చెప్పానని అన్నారు. వారికి మన అవసరం లేకుండాపోవడంతో ప్రత్యేక హోదా దూరం లో ఉందని అన్నారు. మొత్తం మీద ఈ సమావేశంలో జగన్ వ్యాఖ్యలు చూస్తే ఏపీ స్పెషల్ స్టేటస్ పై జగన్ చేతులెత్తేసినటు అర్థం అవుతోంది. దీంతో విపక్షాల నుండి అదేవిధంగా ప్రజలలో కూడా స్పెషల్ స్టేటస్ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ పార్టీకి పెద్ద డ్యామేజ్ తీసుకొస్తున్నాయి. అప్పుడూ, ఇప్పుడూ కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వుంది. మరి ప్రతిపక్షంలో ఉన్న టైంలో వైసీపీ ప్రత్యేక హోదా కోసం పోరాడింది.? ఇప్పుడెందుకు అనగా అధికారంలోకి వచ్చాక ‘వేచి చూస్తాం.. అంతకన్నా చేయడానికేముంది.?’ అని ఎందుకు అంటోంది.? ప్రత్యేక హోదా అంటే, కేవలం.. అది రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికే.. అన్న విషయం వైసీపీ తాజా చర్యలతో నిరూపితమవుతోంది.

 

అప్పట్లో ప్రత్యేక హోదా ని ప్రతిపక్షంలో ఉన్న టైంలో చంద్రబాబుపై రాజకీయంగా పైచేయి సాధించడం కోసమే జగన్ వాడినట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా నెటిజన్ల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ పరిణామంతో వైసీపీ మద్దతు దారులు జగన్ ఈ పాయింట్ బయట పెట్టకుండా ఉండాల్సింది అని అంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: