ప్రస్తుతం భారత దేశాన్ని మిడతల దండు గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ నుంచి ఇండియా వైపు దండెత్తిన మిడతల దండు ఇప్పటికే రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుండా  ఏకంగా ఐదు రాష్ట్రాలు  దాటేసి తెలంగాణ రాష్ట్రం వైపు దూసుకొస్తోంది. అయితే ఈ మిడతల దండు  ఎంత ప్రమాదకర మైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకసారి ఈ మిడతల దండు పంట పై వాలింది అంటే పంట మొత్తం నాశనం  కావాల్సిందే . గంటల వ్యవధిలోనే పంట మొత్తం నాశనం చేస్తాయి ఈ మిడతల దండు. కోట్ల  సంఖ్యలో ఈ మిడతల దండు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం వైపు దూసుకొస్తోంది. అయితే ఈ మిడతల దండు అంశం సాదాసీదా విషయమై అయ్యుంటే  ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం అధికారులకు ఆదేశాలు మాత్రమే జారీ చేసేవారు. 

 


 కానీ మిడతల దండు మాత్రం ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేసేలా చేసింది. ఎందుకంటే వ్యవసాయ రంగం విషయంలో ఏదైనా అపాయం తలెత్తిత్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎ mలాంటి చర్యలు తీసుకోవడానికి అయినా వెనుకడుగు వేయరు అనే విషయం తెలిసిందే. దీంతో తల్లిదండ్రులు ఎదుర్కొనేందుకు ఏకంగా సమావేశం నిర్వహించి అధికారులతో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏం  అంచనా వేస్తుంది అంటే ఇప్పటికే విడుదల చాలా మటుకు ఐదు రాష్ట్రాలలో మిడతలు  చంపేశారు. 

 


 కానీ కొంత సంఖ్యలో మాత్రం ప్రస్తుతం తెలంగాణ వైపుకు దూసుకు వస్తున్నాయి అనేది ప్రభుత్వం అంచనా వేస్తోంది.దీనిని  పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో ఒక కమిటీని కూడా వేశారు. మహారాష్ట్ర చతిస్ ఘడ్  రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో  15 వేల లీటర్ల మలాథియాన్,  క్లోరోఫైరిఫస్, మలత్రియాన్ సైరోత్రిన్   ద్రావణాలను.. 12 అగ్నిమాపక 12 జెట్ వాహనాలను సిద్ధం  చేసింది తెలంగాణ సర్కార్. అంతేకాకుండా మిడతల కదలికను  ఎప్పటికప్పుడు గమనించేందుకు అటు హెలికాప్టర్ ను కూడా ఏర్పాటు చేశారు. స్థానికంగా ఎక్కువ అలవాటు ఉన్నటువంటి ఉన్నత అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: