మొన్నటి దాక అందరిలో కరోనా  వైరస్ భయం. ఎక్కడ ఈ మహమ్మారి దాడి చేసి ప్రాణాలను హరించుకుపోతుందో  అని భయం... ఎవరి ద్వారా వ్యాప్తి చెంది కాటికి పంపిస్తుందో  అనే భయం.. ఈ భయంతోనే ప్రజలు వణుకుతుంటే ఇప్పుడు మరో కొత్త భయం కూడా ప్రజలకు వచ్చి పడింది . ఆ భయమే  మిడతల దండు రూపంలో శరవేగంగా దూసుకొస్తోంది. దీంతో అందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటు అధికారులు కూడా ఎలాంటి పరిస్థితి ఏర్పడిన ఎదుర్కొనేందుకు సిద్ధం పడుతున్నారు. ఇరాన్ పాక్  దేశాల నుంచి కోట్ల సంఖ్యలో మిడతల దండు భారత్పై దండెత్తిన విషయం తెలిసిందే. 

 


 ఇప్పటికే ఏకంగా ఐదు సంవత్సరాలు దాటేసింది మిడతల దండు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మీడతల మాత్రం సంహరించలే పోతున్నారు. దీంతో దాదాపుగా ఐదు రాష్ట్రాలలో పంట నష్టాన్ని కలిగించాయి మిడతలు. ఇక ఈ మిడతల దండు  పేరెత్తితే చాలు రైతులు తెగ కంగారు పడిపోతున్నారు. అయితే నిన్న అనంతపురం జిల్లాలో అకస్మాత్తుగా కొన్ని మిడతలు పంట పై దాడి చేయడం.. రెండు మూడు ప్రాంతాలలో ఈ మిడతలు  దాడి చేసి కాండాలను  తొలిచి వేస్తూ ఉండటం..లాంటి ఘటన జరిగింది. 

 


 అయితే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ అక్కడ స్థానికంగా ఉన్న చెట్ల మీద మీదికి చేరి కాండాలతో  సహా అన్నింటినీ తినేస్తున్నాయి. దీంతో మిడతల దండు అటు తెలంగాణా కు వెళ్లకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది అంటూ తెగ కంగారు పడిపోయారు రైతాంగం . అయితే విడుదల గురించి అధికారులు తెలిపింది ఏమిటి  అంటే అవి భారతదేశం నుంచి దండెత్తిన మిడతలు  కాదని లోకల్ గా పుట్టినవి అంటు  క్లారిటీ ఇచ్చారు. అవి కూడా పంటను నాశనం చేయగలవు  అంటూ చెప్పుకొచ్చారు.పాక్  నుంచి వచ్చే మిడతల దండు ఎంత ప్రయత్నించినప్పటికీ అడ్డుకోవడం కాస్త కష్టమే కాని లోకల్ ముడతలను అడ్డుకోవడం  సాధ్యమైన పని అంటూ అధికారులు తెలిపారు. దీంతో రైతాంగం కాస్త ఊపిరి పీల్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: