తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా రాణించిన జగ్గారెడ్డి కూతురు జయరెడ్డి తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా అడుగులు వేస్తోన్నట్లు సమాచారం. కాంగ్రెస్ కీలక నాయకుడు జగ్గారెడ్డి రాజకీయ నేపథ్యం చూస్తే స్టూడెంట్ లైఫ్ నుండే మొదలయ్యింది. స్టూడెంట్ దశలో ఉన్న టైంలో ఏబీవీపీ లో పనిచేసిన జగ్గారెడ్డి తరువాత బీజేపీ పార్టీలో చేరటం జరిగింది. 1990 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయటం గెలవటం కూడా జరిగింది. అయితే బిజేపి లో జగ్గారెడ్డి అణగదొక్కే కార్యక్రమం అప్పట్లో జరగటంతో తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరారు. తరువాత జగ్గారెడ్డి 2004లో వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

IHG

 

సంగారెడ్డి నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా జగ్గారెడ్డి  మొదటి నుండి తన పట్టు నిలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీలో  సక్సెస్ఫుల్ నేతగా రాణిస్తున్నారు. అటువంటి జగ్గారెడ్డి తన కూతురు జయ రెడ్డి ని రాజకీయాల్లోకి యవ్వన దశలోనే దింపటం ఇటీవల గాంధీభవన్ లో గురువారం మీడియా సమావేశంలో తండ్రి తన పక్కనే జయరెడ్డిని కూర్చోబెట్టుకుని మీడియా సమావేశం నిర్వహించడం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

IHG

దీంతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ వారసత్వం మొదలయిందని చాలామంది అంటున్నారు. మొన్న జరిగిన  అసెంబ్లీ ఎన్నికల టైంలో జగ్గారెడ్డి అరెస్టు అయిన సమయంలో తండ్రి తరుపున ఎన్నికల బరిలో దిగిన జయరెడ్డి స్వయంగా ప్రచారం లో పాల్గొని నియోజకవర్గ ప్రజల మన్ననలను పొందింది. అలాగే మునిసిపల్ ఎన్నికల సమయంలో  సదాశివరావుపేట ఇన్చార్జిగా వ్యవహరించి తండ్రి తరుపున  కొన్ని హామీలూ ఇచ్చారు. ఈ క్రమంలోనే మరింత క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జయరెడ్డికి పార్టీ తరపు నుండి ఆమెకు పదవి కల్పించబోన్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: