జగన్.. ఈ మూడు అక్షరాలు ఆంధ్ర సీమను ఊపేశాయి. ఒక ప్రభంజనం స్రుష్టించాయి. ఏకంగా ఏపీ అసెంబ్లీని  ఊడ్చేసాయి. అంతవరకూ తిరుగులేదనుకున్న విపక్షాన్ని ఎటూ కాకుండా చేశాయి. డెబ్బయ్యేళ్ల రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇంతటి ఘనవిజయం సాధించిన పార్టీ మరోటి లేదంటే నమ్మక తప్పదు. 

 

జగన్ ముఖ్యమంత్రి కావాలి అన్న నినాదాల నుంచి, జగన్ కావాలి, జగన్ రావాలి అన్న పిలుపుల నుంచి జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఏడాది అయింది. సరిగ్గా ఇదే రోజున జగన్ అను నేను అంటూ విజయవాడలో జగన్ ప్రమాణం చేశారు. 

 

గత ఏడాదిగా జగన్ అద్భుతమైన పాలన అందిస్తున్నారనే చెప్పాలి. జగన్ ప్రతి నిర్ణయం విప్లవంగా సాగింది. జగన్ ఏం చేసినా అది జనాల్లోకి వెళ్ళిపోయింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 45 కి పైగా పధకాలు అందించిన ఘనత జగన్ దే.  

 

దాదాపు యాభై వేల కోట్ల రూపాయలతో మూడున్నర కోట్ల మంది ప్రజలకు జగన్ భారీ లబ్ది చేకూర్చారు. జగన్ అధికారం చేపట్టాక నగదు బదిలీ పధకం సంపూర్ణంగా అమలు జరిగింది. నరుగా వారు బ్యాంక్ ఖాతాల్లోకే పధకం నగదు చేరడం అన్నది ఒక హిస్టరీగా చూడాలి. 

 

జగన్ ఏడాది కాలంలో తొంబై శాతం హామీలను నెరవేర్చారు. ఇది కూడా గొప్ప రికార్డే. ఇక ఒక కుటుంబంలో ఎందరు ఉంటే అందరికీ వ్యక్తిగతంగా పధకాలు అమలు చేసిన ఘనత కూడా జగన్ కే దక్కుతుంది. జగన్ కి తొలి ఏడాది క్యాక్ వాక్ లా సాగలేదు. 

 

విపక్షాలు అన్నీ కలసి మూకుమ్మడిగా దాడి చేశాయి. ప్రతీ నిర్ణయాన్ని వివాదం చేశాయి. ఇక జగన్ తాను అనుకున్నట్లుగా పాలన చేసుకుపోతున్నారు తప్ప ఎక్కడా తగ్గడంలేదు. ఈ నేపధ్యంలో జగన్ని ఇబ్బందుల పాలు చేయడానికి విపక్షం  ఎన్నో ప్రయత్నాలు చేయడం తొలి ఏడాది ముచ్చట.  

 

నిజంగా ఏ పార్టీ ప్రభుత్వానికైనా తొలి ఏడాది సజావుగా గడవాలి. జగన్ కి మాత్రం ప్రతీ రోజూ యుధ్ధంగానే సాగింది. దీంతో రాజకీయంగా జగన్ రాటుతేలారు. మరి నాలుగేళ్ల కాలంలో జగన్ ఏ విధంగా తన దూకుడుని చూపిస్తూ పాలనకు ఎలా  పదును పెడతారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: