సినీ అగ్రహీరోలు మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడిప్పుడే బహిరంగంగా తెర మీదకు వస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కొంత మంది సినీ పెద్దలను తీసుకువెళ్లి కలవడం నందమూరి బాలకృష్ణ కు మింగుడుపడలేదు. కనీసం తనను సంప్రదించకుండానే కలవడం ఏంటి అంటూ బాలయ్య తప్పుపట్టడమే కాకుండా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి చిరంజీవి తమ్ముడు నాగబాబు సైతం ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నిర్మాత సి.కళ్యాణ్ కూడా ఇదంతా కెసిఆర్ ఆదేశాల మేరకే జరిగిందని, కెసిఆర్ పిలవమంటే పిలిచేవారిమని చెప్పారు. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా సినిమాహాళ్లు మూతపడ్డాయి. షూటింగ్ లు నిలిచిపోయాయి. 

IHG


ఈ సమయంలో ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోలు మధ్య  చిన్నగా మొదలైన వివాదం ఏ మలుపు తిరుగుతుందో అనే ఆందోళన అందరిలోనూ నెలకొంది. తాజాగా బాలయ్య వ్యాఖ్యలపై ఏం చేయాలనే విషయంపై హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో సినీ పెద్దలు కొంతమంది సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బాలయ్య కామెంట్లకు ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలనే దానిపై చర్చ జరిగినట్లు సమాచారం. లాక్ డౌన్ కారణంగా సినీ కళాకారులను ఆదుకునేందుకు ఏర్పాటుచేసిన కరోనా చారిటీ క్రైసిస్ పేరుతో చేస్తున్నఈ  చారిటీ ని ఈ నెల కూడా కొనసాగించే విషయంలో సినీ ప్రముఖులు చిరు నివాసంలో సమావేశం ఏర్పాటు చేసుకోగా ఆ సమావేశంలో బాలయ్య వ్యవహారం మీదే మొత్తం చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 

 

IHG


దీంతో సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు మొదలయినట్టుగా కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో ప్రభుత్వంతో సినిమా ఇండస్ట్రీ పెద్దలు సంప్రదింపులు చేయడం పెద్దగా కలిసి రాదన్నది కొంతమంది ఆలోచన. సినిమా షూటింగ్ ల విషయంలో ప్రభుత్వంను ఏవిధంగా ఒప్పించాలి అనే విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ సీఎం జగన్ ను కూడా కలవాలని ఇప్పటికే టాలీవుడ్ పెద్దలు  నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ సమావేశానికి బాలయ్యను పిలవాలా ? పిలిస్తే జగన్ వద్దకు ఆయన వస్తారా అనే సందేహం కూడా సినీ పెద్దలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య వ్యవహారంలో సినీ పెద్దలు ఎక్కువగా చిరు వైపు నిలబడేందుకు మొగ్గుచూపినట్లు గా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: