ఏపీ సీఎంగా జగన్ ప్రజల్లో మంచి మార్కులే వేయించుకుంటున్నారు. నిత్యం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. దేశ వ్యాప్తంగా జగన్ పాలనకు మంచి గుర్తింపు వస్తోంది. ఆయన అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. కానీ ఒక్క విషయంలోనే ఆయన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఏపీ సీఎంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వరుస వరుసగా వివాదాస్పదం అవుతున్నాయి. కోర్టులు తప్పు పడుతున్నాయి. వైసీపీ అధికారంలోక వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జగన్ తీసుకున్న అన్ని కీలక నిర్ణయలకు కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వ్యవహారంలోనూ వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.

IHG


 ఆర్టికల్ 213 ప్రకారం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం చెల్లదని, అసలు ఆ అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు తీర్పు చెప్పడంతో ప్రస్తుత కమిషనర్ గా ఉన్న కనగరాజ్ పదవి తొలిగినట్టేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలాగే హై కోర్ట్ తీర్పు వచ్చిన వెంటనే విధుల్లో చేరబోతున్నాను అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. కాకపోతే ఈ విషయం లో సుప్రీంకోర్టుకు వెళ్లాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక ఈ సంగతి పక్కన పెడితే ఏపీ సీఎం జగన్ వ్యవహార శైలిలో మార్పు రావాలని, ముఖ్యంగా ఆయన కమ్మ కులం పై కోపం తగ్గించుకోవాలంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు. 


జగన్ తన కింద పని చేసే ఇద్దరు, ముగ్గురు అధికారులు తప్ప మిగతా వారందరిని చంద్రబాబు మనుషులుగా చూస్తూ, వారిలో కులాన్ని వెతుకుతూ పక్కన పెట్టడం సరికాదని, జగన్ ఆలోచనలో మార్పు రాకపోతే ముందు ముందు ఇంకా అనేక ఎదురు దెబ్బలు తినాల్సి ఉంటుంది అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: