అదేంటి.. జగన్ సీఎం కాదు.. డాక్టర్ జగన్ అంటారేంటి అంటున్నారా.. అవును మరి.. ఆయన వైద్యరంగంలో అందిస్తున్న సేవలు చూస్తే.. ఆయన సీఎంగా కంటే.. ఓ మంచి వైద్యుడిగా ఎక్కువ సేవలు అందిస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. ప్రభుత్వ ఆసుపత్రులంటే ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. వాటి దుస్థితి చూసే నేను రాను బిడ్డో అంటూ సినీ కవులు పాటలు రాశారు.

 

 

కానీ ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రుల ముఖ చిత్రం మారిపోతోంది. వైఎస్ జగన్ ఆరోగ్య రంగానికి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త ఆసుపత్రులు కడుతున్నారు. కొత్త పీహెచ్ సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యులను పుష్కలంగా నియమించేందుకు పచ్చజెండా ఊపారు. 104, 108 సేవల కోసం కొత్త వాహనాలను సమకూరుస్తున్నారు. ఒక్కటేమిటి వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ సంక్షేమానికి కొత్త అర్థం చెబుతున్నారు వైఎస్ జగన్.

 

 

గ్రామల్లో వైద్య సేవల కోసం ఊర్లోనే విలేజ్‌ క్లినిక్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఏఎన్‌ఎం నర్సు 24 గంటలు అందుబాటులో ఉంటారు. అక్కడికే ఆశా వర్కర్లు వచ్చి రిపోర్టు చేస్తారు. విలేజ్‌ క్లినిక్‌లో 54 రకాలకు సంబంధించిన మెడిసిన్‌ అందుబాటులో ఉంటుంది. ఇంతకంటే పెద్ద వైద్యం చేయించుకునే పరిస్థితి వస్తే.. ఆరోగ్యశ్రీకి అక్కడి నుంచే రెఫరల్‌ పాయింట్‌. 104, 108 వాహనాలు 20 నిమిషాల్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితిని గ్రామ స్థాయిలోకి తీసుకువస్తున్నారు. దాదాపుగా 13 వేలకు పైచిలుకు విలేజ్‌ క్లినిక్స్‌ అండ్‌ వార్డు క్లినిక్స్‌ తీసుకురాబోతున్నారు. వీటి నిర్మాణం కూడా 2021 మార్చి వరకు రెడీ అవుతాయి. వీటి కోసం రూ.2600 కోట్లు ఖర్చుచేస్తున్నారు.

 

 

అంతేనా.. 149 చోట్ల కొత్త పీహెచ్‌సీలు కట్టబోతున్నారు. 1138 పీహెచ్‌సీలను అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చబోతున్నారు. ఇప్పటికే ఉన్న 11 మెడికల్‌ కాలేజీల రూపురేఖలు మారుస్తారు. మరో 16 మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తారు. గిరిజన ప్రాంతంలో 7 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను కట్టబోతున్నారు. వీటికి ఆగస్టులో టెండర్లు పిలుస్తారు. రూ.12,270 కోట్లతో మూడేళ్లలో పూర్తిచేస్తారు. మరి ఇవన్నీ చూస్తే జగన్ ను సీఎం కంటే డాక్టర్ జగన్ అనడమే కరెక్టేమో అనిపించడం లేదూ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: