ముఖ్యమంత్రిగా జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నాడు. ఒక వ్యక్తి ఏడాది పాలనతో అతడిని బేరీజు వేయకపోయినా.. ఆ అడుగులు ఎటువైపు పడుతున్నాయో చెప్పేందుకు ఏడాది సరిపోతుంది. జగన్ జనంతో ఓటు వేయించుకునే ముందే తన లక్ష్యం ఏంటో చెప్పేశాడు. తనకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో రెండు పేజీల మేనిఫెస్టోలో చెప్పేశాడు. ఇప్పుడు జగన్ చేస్తున్నది ఆ మేనిఫెస్టోను అమల్లోకి పెట్టడమే.

 

 

అసలు జగన్ మేనిఫెస్టో ప్రకటించిన సమయంలో ఇది సాధ్యమా అన్నవారు చాలా మంది. బడుగులకు రెండు వేలు దాటిని ఫింఛన్, అమ్మఒడి, పూర్తిస్థాయి ఫీజు రీఎంబర్స్ మెంట్, రైతు భరోసా, రూ. 1000 బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి.. రైతుల కోసం మార్కెట్ స్థిరీకరణ నిధి.. ఇలాంటి ఎన్నో హామీలు జగన్ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఇవన్నీ బడుగుల సంక్షేమం కోసం లక్షించినవే.

 

 

సాధారణంగా రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చిన 2, 3 ఏళ్లు పెద్దగా సంక్షేమంపై దృష్టి సారించరు. చివరి రెండు మూడేళ్లలో సంక్షేమం గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే.. ఇప్పుడు చేసినా జనం మరిచిపోతారని.. ఓటేసే ముందు పథకాలు అందిస్తే బాగా గుర్తు పెట్టుకుంటారని.. కానీ జగన్ ఇందుకు పూర్తిగా భిన్నం. అధికారంలోకి వచ్చిన వెంటనే తన మేనిఫెస్టోను ఫ్లెక్సీలు తయారు చేయించి తన కార్యాలయంలో పెట్టుకున్నాడు. తనతో పాటు మిగిలిన నేతలనూ అదే పని చేయమన్నాడు.

 

అందుకే అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే తన మేనిఫెస్టోలోని దాదాపు 90 శాతం హామీలను అమల్లో పెట్టేశాడు.. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. అందులోనూ చంద్రబాబు ప్రభుత్వం మిగిల్చిన బకాయిలే వేల కోట్లలో ఉన్నాయి. అయినా జగన్ వెరవలేదు. మనసు ఉంటే మార్గం ఉంటుందని నిరూపించాడు. చివరకు కరోనా సమయంలోనూ వాహన మిత్ర డబ్బు అందించాడంటే.. తన మేనిఫెస్టోను ఆయన భగవద్గీతగా, బైబిల్ గా, ఖురాన్ గా భావిస్తున్నాడని చెప్పడంలో సందేహం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే జగన్ చెప్పిందే చేసుకుంటూపోతున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: