ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు ఏడాది పూర్తైంది. మోదీ పాలనకు ఏడాది పూర్తైన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, నేతలు ఇళ్లకే పరిమితమై సంబరాలు చేసుకుంటున్నారు. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ మోదీ ఏడాది పాలనపై ఆన్ లైన్ లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో దాదాపు 65,000 మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మోదీ ఏడాది పాలనపై 62 శాతం మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారు. 
 
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 59 శాతం ప్రజలు కరోనా కట్టడి కోసం మోదీ సర్కార్ చాలా బాగా పని చేసిందని పేర్కొనన్నారు. ఉద్యోగ కల్పనలో మాత్రం మోదీ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని 56 శాతం కేంద్రం అసలు పట్టించుకోవడం లేదని అభిప్రాయపడుతున్నారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత వ్యాపార కార్యకలాపాల నిర్వహణ మరింత తేలికైందని 43 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
మోదీ పరిపాలన వల్ల ప్రపంచ దేశాల్లో భారత్ ఇమేజ్ పెరిగిందని 79 శాతం అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంలో అవినీతి బాగా తగ్గిందని 49 శాతం మంది అభిప్రాయపడ్డారు. పన్ను అధికారుల వేధింపులు తక్కువయ్యాయని 52 శాతం మంది చెప్పగా, కమ్యూనలిజంకు సంబంధించిన వివాదాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోందని 56 శాతం మంది అభిప్రాయపడ్దారు. 
 
స్టార్టప్‌ల స్థాపన సులువుగా మారిందని 37 శాతం మంది, పార్లమెంటులో బిల్లులు నెగ్గించుకోవడం సహా సభపై పట్టుసాధించే సామర్థ్యం మెరుగైందని 79 శాతం మంది అభిప్రాయపడ్డారు. దాదాపు 15 కేటగిరీల్లో జరిగిన సర్వేల్లో మెజారిటీ శాతం ప్రజలు మోదీ అనుకూలంగా ఓటు వేశారు. మోదీ ఏడాది పాలనలో దేశంలో మెజారిటీ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.  ఇతర సర్వేల్లో కూడా మోదీ ఏడాది పాలనపై ఇంచుమించు ఇదే తరహా ఫలితాలు రావడం గమనార్హం. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: