ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మార్పులు దేశం మొత్తం గమనించింది. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి విప్లవాత్మకమైన మార్పునే తీసుకొచ్చారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ను ఇంటి వద్దకే వెళ్లి అందేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లి వ్యవప్రయాలకు తావు లేకుండా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇంటింటికి రేషన్ అందించే కార్యక్రమం కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రజలకు చేరువ చేసే ఏ కార్యక్రమమైన ప్రభుత్వం అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది అని సీఎం జగన్ చెప్పకనే చెప్తున్నారు.

 

 

జగన్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న విప్లవాత్మకమైన మార్పు గ్రామ – వార్డు సచివాలయాలు. ప్రతి ఇంటి గడప వద్దకే ప్రభుత్వ సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఈ ఏర్పాట్లు చేసింది. 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాల్లో 541కి పైగా సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఇవన్నీ నిర్ధిష్ట కాలపరిమితిలోనే ఏర్పాటు చేయడం విశేషం. ప్రతి 2వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఉండేలా ఏర్పాటు చేశారు. రాష్ట్రం మొత్తం మీద వీటిలో లక్షకు పైగా ఉద్యోగులను నియమించారు. లక్షా తొంభై మూడు వేలకు పైగా గ్రామ వాలంటీర్లు, 74వేల పైచిలుకు వార్డు వాలంటీర్ల ద్వారా ప్రజల ముంగిటకే సేవలు అందించి కొత్త వ్యవస్థకు నాంది పలికారు.

 

 

ప్రజలకు అందుబాటులోకే సేవలు తేవాలన్న లక్ష్యాన్ని జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వెంటనే నెరవేర్చారు. దీంతో ప్రజలకు ప్రభుత్వంతో ఏర్పడే పనులు సులువయ్యాయి. జగన్ ప్రభుత్వ విధానాలతో 3కోట్ల మంది ప్రజలకు పైగా లబ్ది పొందారు. జగన్ విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా గమనించే పరిస్థితి వచ్చింది. ఇది జగన్ సాధించిన విజయం అనే చెప్పాలి. పాలనకు కొత్త అర్ధం తీసుకొస్తూ ప్రజల కోసమే పని చేయడం ప్రభుత్వ విధి. ఈ విషయంలో సీఎంగా జగన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: