దేశ ప్రధాని నరేంద్ర మోడీ రెండవ సారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిన విషయం తెలిసిందే. మొదటిసారి 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ తన పాలతో దేశ అభివృద్ధి ని పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. ఇక తన పాలనతో దేశ ప్రజానీకాన్ని మొత్తం మెప్పించారు ప్రధాని నరేంద్ర మోడీ. పాలనలతో  ప్రజలు ఎంతగానో ప్రభావితం చేయడంతో రెండవసారి కూడా పార్లమెంటు ఎన్నికల్లో మోడీ నాయకత్వం వైపు ఎక్కువగా మొగ్గు చూపారు దేశ ప్రజానీకం. మొదటిసారి భారీ మెజారిటీ సాధించిన బిజెపి పార్టీ రెండవసారి అంతకుమించిన మెజారిటీ సాధించింది. రెండవసారి కూడా దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకరం చేశారు. ఇక నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసి నేటికీ సంవత్సరకాలం పూర్తయింది. 

 

 ఇక ఈ సంవత్సర కాలంలో కూడా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఇక ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఎంతోమంది రాజకీయ ప్రముఖులు మోడీ పాలన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే తాజాగా ఇదే విషయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఇక మోడీ పై ప్రశంసలు కురిపించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి... మోడీ అనే పేరులోనే ఒక మంత్రం ఉంది అంటూ వ్యాఖ్యానించారు. 

 

cm
 M  అంటే మోటివేషన్ అని... భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు మోదీ పని చేస్తూ అందరికీ ప్రేరణనిస్తూ  ఉన్నారు అంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. O  అంటే ఆపర్చునిటీ అని... భారత అభివృద్ధి కోసం.. భారత్ లో దాగి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ మోదీ పనిచేస్తున్నారని... D అంటే డైనమిక్ లీడర్ షిప్ అని... i అంటే ఇన్స్పైర్ తో పాటు ఇండియా అని చెప్పుకొచ్చారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.కాగా ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ మోదీ అనే పదానికి కొత్త అర్దం  చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: