కనిపించే.. కనిపించని శత్రువులతో జగన్ నిత్యం యుద్ధమే చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏడాదిగా ఇదే విధంగా పోరాటం చేస్తూనే వస్తున్నారు. జగన్ కు పోరాటాలు కొత్తేమీ కాదు. పార్టీ తొమ్మిదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్నా, తన పట్టుదలతో అప్పటి అధికార పార్టీల వేధింపులను సైత తట్టుకుంటూ, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కుంటూ ఈ  స్థాయికి రాగలిగాడు. కాబట్టే ఇప్పుడు తన ఏడాది పరిపాలనలో ఎదురైనా, ఎదురవుతున్న అన్ని ఇబ్బందులను జగన్ సమర్థవంతంగా ఎదుర్కొంటూ దిగ్విజయంగా ఏడాది పరిపాలన పూర్తి చేశారు. ఏపీ లోని రాజకీయ పక్షాలన్నీ ఒకవైపు, తాను ఒక వైపు అన్నట్టుగా అన్ని పార్టీలతో జగన్ నిత్యం యుద్ధమే చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పథకం అమలు చేసినా దానిలోని సూక్ష్మ లోపాలను వెతికే పనిలో వైసిపి రాజకీయ ప్రత్యర్థులు నిత్యం నిమగ్నమై ఉంటున్నారు. 

 

IHG


దీనికి తోడు ఒక వర్గం మీడియా కూడా జగన్ పైన ఆయన ప్రభుత్వంపైనా కక్ష కట్టినట్టుగా నిత్యం ఏదో ఒక సందర్భంలో విమర్శలు చేసేందుకు ముందు ఉంటూ, ప్రత్యేక కథనాలను వండి వార్చుతూ వస్తోంది. జగన్ ను టోటల్ గా ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, బెదరకుండా జగన్ ముందుకే వెళ్తున్నారు. తాను ప్రజలకు మంచి చేసి చూపించడమే తన రాజకీయ శత్రువుల కు ఒక చక్కటి గుణపాఠం అనే సూత్రాన్ని జగన్ పాటిస్తున్నారు. ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఏదో ఒక సాకుతో జగన్ నిర్ణయాలు అమలు కాకుండా చూడాలన్నదే ఆ పార్టీల ఉద్దేశంగా కనిపిస్తోంది. 

IHG


ఇప్పటికే జగన్ ఏడాది పాలనలో ఎన్నో చేసి చూపించారు. గత ప్రభుత్వాలు ఏవీ చేయని విధంగా ఏడాదిలోనే జగన్ పాలన ఎలా ఉంటుందో చూపించారు. ఇంకా నాలుగేళ్ల సమయంలో మరెన్నో చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తాను చేసే పనిలో మంచి ఉన్నప్పుడు తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా జగన్ ధైర్యంగా, మొండిగా ముందుకు వెళ్తున్నారు. అలాగే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎక్కడా అవినీతి అనేది లేకుండా పారదర్శకంగా పరిపాలన అందిస్తూ వస్తున్నారు. అనేక వ్యవస్థలను, ప్రతిపక్షాలను ఎదుర్కుంటూ జగన్ నిత్యం యుద్ధమే చేస్తున్నా, ప్రజలకు నేను మంచి చేయగలుగుతున్నాను అనే సంతృప్తితో జగన్ కనిపిస్తున్నారు. ఒక మంచి పని చేయాలంటే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాలా ..?  అనేది జగన్ విషయంలో రుజువవుతోంది.  తనకు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా జగన్ ప్రజల మనస్సు గెలుచుకోగలిగారు. ప్రతి దశలోనూ జగన్ కు జనాల నుంచి మద్దతు లభిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: