ఢిల్లీ నగరంలో డ్యూటీ నిర్వహిస్తున్న ఏఎస్ఐ రతన్ సింగ్ ప్రతిరోజు ఉదయం వందల పక్షులకు ముఖ్యంగా పావురాలకు ఆహారం అందిస్తారు. సౌత్ ఈస్ట్ ఢిల్లీ లోని అమర్ కాలనీ కి చెందిన పావురాల కి రతన్ సింగ్ ఆహారం వేస్తుంటారని ఆ కాలనీ నేత గుంజన్ సింగ్ మీడియాకు చెప్పాడు. భారత దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన రోజు నుండి ప్రజలెవరూ బయటకు రావడం లేదు. దాంతో పక్షులకి ఆహారం వేసే వాళ్ళు కరవయ్యారు. ఇది తెలుసుకున్న రతన్ సింగ్ స్వయానా తన జీవితం నుండి డబ్బులు పక్షుల కోసం ఖర్చుపెట్టి వాటి ఆకలిని తీరుస్తున్నారు. తాను డ్యూటీ నిర్వహిస్తూనే వీలుచిక్కినప్పుడల్లా పక్షులకి ఆహారం అందిస్తుంటారు. 


ఏఎస్ఐ రతన్ మాట్లాడుతూ... ఆకలితో అలమటిస్తున్న మూగజీవులకు ఆహారం అందించడం మన ధర్మం. ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. రతన్ సింగ్ ఢిల్లీ లోని ఆగ్నేయ ప్రాంతాలలోని కైలాష్, అమర్ కాలనీ లో పావురాలకు ఆహారం అందిస్తారు. 59 సంవత్సరాల వయసున్న రతన్ సింగ్ ఒక సంవత్సరంలో రిటైర్ అవ్వబోతున్నారు. ప్రస్తుతం నేను చేస్తున్న పని పెద్ద విశేషమేమీ కాదు. పక్షులన్ని ఈ భూమ్మీద మనలాగా జీవిస్తున్న జీవులు. వాటిని సంరక్షించడం మన బాధ్యత. నా చిన్నతనంలో ఈ విలువలను మా అమ్మ చెప్పింది. నేను చాలా పేద వాడిని. పెద్ద కార్యాలను చేయలేను. చిన్న చిన్న మంచి పనులు చేసే మోక్షం పొందగలను అని ఉత్తరప్రదేశ్ కు చెందిన రతన్ సింగ్ చెప్పుకొచ్చారు. 


మా ఇంటి గేటు ముందు ఎల్లప్పుడూ కుండా నిండా నీళ్లు ఉంచుతాను. పక్షులు జంతువులు దాహం తీర్చుకునేందుకు అవి ఉపయోగపడతాయి. ఈ మూగ జీవులు మనతో మాట్లాడలేక పోతాయి. అందుకని వాటి సమస్యలను మనం గుర్తించకపోవడం పెద్ద తప్పు. మూగ జీవులు దేవుళ్ళతో సమానం అని మన పవిత్ర గ్రంథాలలో రాసి ఉంది. అందుకే వాటికి ఆహారం అందిస్తే మనకి పుణ్యం కలుగుతుంది అని రతన్ సింగ్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: