గత కొన్ని రోజుల నుండి చీరాల రాజకీయలలో అనిశ్చితి నెలకొంది. ప్రత్యర్థి పార్టీకి చెందిన కొంతమంది నాయకులు వైసీపీ పార్టీలో చేరడంతో పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకులకు అండగా మద్దతుగా సోషల్ మీడియాలో త్వరలోనే చీరాల ఇంచార్జి పోస్ట్ మారబోతున్నట్లు కొంతమంది పోస్టులు పెడుతూ తేగా ప్రచారం చేస్తున్నారు. దీంతో చీరాల నియోజకవర్గం వైసీపీ పార్టీ కార్యకర్తల లో చీలిక వచ్చే విధంగా గొడవలు వస్తున్న తరుణంలో వెంటనే ఆమంచి కృష్ణమోహన్ కలుగ చేసుకున్నారు. డైరెక్టుగా పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తో అమరావతిలో భేటీ అయ్యి ఈ  విషయం గురించి చర్చలు జరిపారు. దీంతో విషయం సీఎం జగన్ మోహన్ రెడ్డి దాకా వెళ్లడంతో ఆమంచి లైన్ క్లియర్ చేస్తూ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా ప్రకటన చేశారు. 

IHG

చీరాల వైసీపీ నియోజకవర్గం ఇంచార్జ్ గా ఆమంచి కృష్ణమోహనే  కొనసాగుతారని అందులో  ఎటువంటి సందేహం లేదని ఎలాంటి మార్పులు ఉండవని వస్తున్న వార్తలకు తనదైన శైలిలో జగన్ పులిస్టాప్ పెట్టారు. స్వయంగా అధ్యక్షుడు క్లారిటీ ఇవ్వడంతో చీరాల నియోజకవర్గంలో గందరగోళ రాజకీయ పరిస్థితులు అంతా ఇప్పుడు సద్దుమణిగాయి. మరోపక్క జగన్ ఏడాది పరిపాలన గురించి ఇటీవల ఆమంచి కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడుతూ… ఒక్క ఏడాదిలో చంద్రబాబుకి జగన్ ట్రైలర్ చూపించారని మిగతా సినిమా ముందుందని అన్నారు.

IHG

మరో నాలుగు సంవత్సరాల పూర్తి పాలనలో చంద్రబాబు రాజకీయాలు క్లైమాక్స్ కి చేరిపోతాయి అని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సొంత కొడుకు నారా లోకేష్ ని మంగళగిరిలో గెలిపించుకోలేక పోయారు అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే లోకేష్ అసెంబ్లీ లోకి పంపాలంటే జగన్ కాళ్ళు పట్టుకుని వైసీపీ టిక్కెట్ అడగాల్సిన పరిస్థితి నెలకొందని ఆమంచి పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ సమయంలో చంద్రబాబు ప్రతిపక్ష పాత్ర పోషించకుండా హైదరాబాదు పారిపోయి తలదాచుకున్నాడని ఆమంచి విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: