దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా పెరిగి పోతున్న విషయం తెలిసిందే. మొదట్లో అతి తక్కువగా ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం శరవేగంగా పెరిగిపోతుంది. ఇప్పటికే దేశంలో రెండు లక్షలకు చేరువగా వెళుతుంది కరోనా కేసుల సంఖ్య. కరోనా  వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ మహమ్మారి వైరస్కు వ్యాక్సిన్ లేకపోవడంతో... కరోనా ను అరికట్టడంలో  కీలక పాత్ర పోషించేది సామాజిక దూరం అన్న విషయం తెలిసిందే. అందుకే ప్రజల మధ్య మరింత సామాజిక దూరం ఉండేలా చేసేందుకు అధికారులు కీలక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల మధ్య సామాజిక దూరం ఉండేలా పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. 

 


 ఇక తాజాగా కరోనా  వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. కోయంబేడు లోని తమ ప్రధాన కార్యాలయంలో ఫుట్ ఆపరేటర్ లిఫ్ట్ ను ఏర్పాటు చేసింది. ఇక ఈ లిఫ్టులో  ప్రవేశించిన తర్వాత చేతులకు లిఫ్టింగ్ తాకకుండా పాదరక్షలతో ఆపరేట్ చేసే విధంగా సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది ... తద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉందని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రయాణికుల సంక్షేమార్థం ఇలాంటి లిఫ్ట్ ను ఏర్పాటు చేసిన మొట్టమొదటి మెట్రో రైల్వేగా  చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నిలిచింది. అయితే ఇలా కాళ్లతో ఆపరేటింగ్ చేసే లిఫ్ట్ ను ఏర్పాటు చేయడం ద్వారా పాదరక్షలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండదు. అదే  చేతులతో అయితే ఎంతో మంది ఒకే ప్లేస్ తో టచ్ చేస్తూ ఉంటారు.

 


 కాబట్టి అక్కడ ముట్టుకున్న చేతులను  మళ్లీ ముఖం మీద కూడా పెట్టుకునే  అవకాశం ఉంది. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని మెట్రో స్టేషన్లలో కూడా ఇలాంటి ఫుట్ ఆపరేటింగ్ లిఫ్ట్ లను  ఏర్పాటు చేయనున్నట్లు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ తెలిపింది . ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో   25 శాతం మంది సిబ్బందితో కొన్ని పనులు నిర్వహించడానికి మెట్రో స్టేషన్లు తెరిచి ఉంచారు. తమిళనాడులో రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి వైరస్ ను తమ రాష్ట్రంలో అదుపు చేసేందుకు అటు ప్రభుత్వాలు ఇటు అధికారులు ఎన్నో చర్యలు కూడా చేపడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా చెన్నై నగరంలో మెట్రో రైల్ కు సంబంధించి వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇలాంటి  నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: