జగన్ అనే నేను... ఏసీ సీఎం గా అంటూ... బాధ్యతలు స్వీకరించి నేటికి సరిగ్గా ఏడాది అవుతుంది. ఈ ఏడాది కాలంలో జగన్ పరిపాలనా పరంగా ఎన్ని మార్కులు వేయించుకున్నారు ? ఎన్ని ఇబ్బందులు పడ్డారు ? ఎంతగా జనాలతో జేజేలు కొట్టించుకుంటారు ? ఎంత మంది ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ? ఇలా అనేక లెక్కలు బయటకు వస్తున్నాయి. జగన్ ఏడాది పాలనలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. దీనికి జగన్ స్వయం కృతాపరాధం కూడా ఉంది. జగన్ అధికారం చేపట్టే సమయానికి ఏపీ ఖజానా ఖాళీ అయింది. అయినా మొండి ధైర్యంతో జగన్ ముందుకు వెళ్తున్నారు. అలాగే ఆ పార్టీకి అనుకూలంగా ఉండే అతిపెద్ద మీడియా సంస్థలతోనూ జగన్ పోరాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కి ఉన్నది 20 మంది ఎమ్మెల్యేలు అయినా, 151 మంది ఉన్న అధికార పార్టీని ఢీ కొట్టేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. జగన్ కు రాజకీయంగా పాలనా అనుభవం లేకపోవడంతో, తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు అనేది వాస్తవం.

IHG


 సీఎంగా ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే సంకల్పంతో ఉంటే సరిపోదు. దానికి తగినట్లుగా పరిస్థితులను మార్చుకోవడం, తమ పరిధులు, విధానాలు అన్నిటినీ సమానంగా బ్యాలెన్స్ చేయడం, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా పరిపాలన చేయడం, రాజ్యాంగ సంస్థలను గౌరవించే విషయంలో, ఇలా అన్నిటిలోనూ పరిధులు, పరిమితులు అన్నీ తెలుసుకుని ముందడుగు వేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం కోర్టు కేసులతో సతమతం అవుతోంది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తీసుకుంటున్న మెజార్టీ నిర్ణయాలను కోర్టులు తప్పు పడుతోంది.  జగన్ మాత్రం ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు.

IHG


 వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని విధానాలు ఆ పార్టీకి చేటు తెచ్చిపెట్టాయి. ఉదాహరణగా చెప్పుకుంటే ఇసుక పాలసీ విధానం జగన్ తొందరపాటు నిర్ణయాలలో ఒకటిగా చెప్పుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక ద్వారా అనేక అక్రమాలకు పాల్పడుతోందని, అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు కోట్లాది రూపాయలు వెనుకేసుకున్నారు అనే అభిప్రాయంతో జగన్ కొత్త ఇసుక విధానం తీసుకువచ్చేందుకు ఇసుక తవ్వకాలను మొత్తం నిషేధించారు. కొత్త ఇసుక పాలసీ రూపొందించే సమయంలోనే ఆకస్మాత్తుగా ఏపీని వర్షాలు ముంచెత్తడంతో సుమారు ఆరు నెలల పాటు రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఏర్పడింది. 

 

IHG's Promises | #Navaratnalu 3 ...


ఈ ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. ఇదంతా జగన్ ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోయింది. జగన్ మంచి ఉద్దేశంతో కొత్త ఇసుక పాలసీ తీసుకొద్దామని చూసినా, అది చివరకు బెడిసి కొట్టింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యం, గ్రామ సచివాలయాలు , వాలంటీర్ల వ్యవస్థ ఇలా ఎన్నో ప్రజా ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే మద్యపాన నిషేధాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ జగన్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేందుకు ప్రయత్నించే క్రమంలో కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఆయనకు రావాల్సిన మంచి పేరును కాస్తా చెడగొడుతుంది అనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. 

 

IHG


అంతిమంగా చూసుకుంటే జగన్ ఏ విధంగా పరిపాలించినా, ఒక నాయకుడు పరిపాలన కారణంగా తమ జీవితాలు బాగుపడ్డాయి అని ప్రజలు భావిస్తే ఆ నాయకుడిని జీవితాంతం గుర్తుంచుకుంటారు. అలా గుర్తిండిపోయే నాయకుల్లో తప్పకుండా జగన్ ముందు వరుసలో ఉంటారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే జగన్ ఇప్పుడు ఎన్ని ఎదురు దెబ్బలు తింటున్నా అంతిమంగా ఆయనలో ప్రజలకు మంచి చేయాలన్న తపన కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: