దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి వల్ల ఎన్ని కష్టాలు పడుతున్నామో తెలిసిందే. ఇదే సమయంలో జమ్మూకాశ్మీర్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పపాడుతున్నారు. మరోవైపు పాక్ నుంచి మిడుతల దండు వచ్చి ఇక్కడి పంటలను నాశనం చేస్తున్నాయి.  అన్నివిధాల పావురాన్ని పరీక్షించిన అనంతరం దానిని ఎలాంటి సీక్రెట్‌ ఆపరేషన్లకి ఉపయోగించలేదని నిర్థారించుకున్న తరువాత పోలీసులు విడిచిపెట్టారు. గత ఆదివారం పాకిస్తాన్‌ నుంచి వచ్చిన  పావురం బోర్డర్‌కు దగ్గరలో ఉన్న  గీత దేవి చద్వాల్‌ అనే మహిళ  ఇంటిపై వాలింది.

 అది సాధారణమైన పావురం అయితే పెద్దగా పట్టించుకుని ఉండేవారు కాదు.. కానీ దాని రెక్కకు కలర్ అంటింది.. కాలుకి రింగ్ ఉంది.  ఆ పావురం కాలికి ఒక రింగ్‌ ఉండటాన్ని గమనించిన గీత వెంటనే దానిని పట్టుకొని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌కు అప్పగించింది. వారు పావురం గురించి స్థానిక హిరా నగర్‌ పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. పావురం కాలు మీద ఉంగరం తోపాటు చెక్కబడిన సంఖ్యలు ఉండడంతో కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాదులకు సమాచారం చేరవేయడానికి ఇది వచ్చిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

పాక్ పావురం

అయితే దానిని పరీక్షించిన అనంతరం అటువంటిది ఏది లేదని తేల్చారు పోలీసులు.  దీనికి సంబంధించి అధికారులు మాట్లాడుతూ.. ఇది అంతర్జాతీయ సరిహద్దు కావడంతో పాటు చాలా సున్నితమైన ప్రదేశం. రహస్య సమాచారం చేరవేసుకోవడం అనేది ఈ ప్రాంతంలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. సహజంగా మేం పక్షలను అనుమానించం. అవి వాటి పని అవి చేసుకొని వెళుతూ ఉంటాయి అని తెలిపారు.  ఇక ఆ పావురం కాలికి ఉన్న ఉగరం పై ఉన్న నంబర్లను ఉగ్రవాదులు వాడే సీక్రెట్‌ కోడ్‌ గా మొదట భావించగా దీనిపై స్ఫందించిన హబిబుల్లా ఉంగరంపై ఉన్న నంబరు తన ఫోన్ నంబర్‌ అని అంతే కానీ దాంట్లో ఎలాంటి సీక్రెట్‌ కోడ్‌ లేదని తెలిపారు. అదేవిధంగా పావురాల రేస్‌లో పాల్గొందని తెలిపారు. మరి ఈ పావురం తన యజమాని వద్దకు చేరుకుంటుందా లేదా చూాడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: