సాధారణంగా ఏ దేశంలోనైనా శత్రు దేశానికి చెందిన వ్యక్తులు సంచరిస్తున్నారంటే అనుమానాలు మొదలవుతాయి. వ్యక్తులుగా వారు మంచివారో చెడ్డవారో చెప్పలేం కానీ శత్రు దేశం అంటే చాలు గుండెల్లో గుబులు పుడుతుంది. గతంలో రెండు దేశాల మధ్య జరిగినటువంటి కార్యకలాపాల వల్ల పౌరుల్లో అవతలి దేశాల వ్యక్తులపై వ్యతిరేకత ఏర్పడుతుంది. అదే విధంగా చైనాకు భారత్ కు సంబంధించిన కొన్ని పేర్లు వింటే కడుపుమంట పడుతుంది. 
 
గతంలో వాజ్ పేయ్ పై ఆక్రోశాన్ని వెల్లగక్కిన చైనా... ప్రస్తుతం మోదీపై ఆక్రోశం వెల్లగక్కుతోంది. కొంతమంది సైనిక అధికారుల పేర్లు విన్నా చైనా ఇదే తరహాలో ప్రవర్తిస్తుంది. గతంలో చైనా సరిహద్దుల్లో నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పిన ప్రతిసారి భారత్ నిర్మాణాలు ఆపివేసింది. వాజ్ పేయ్ అధికారంలో ఉన్న సమయంలో సరిహద్దు ప్రాంతాలకు మన సైనికులు వెళ్లేలా రోడ్లు... సైన్యం దిగడానికి కావాల్సిన హెలీ ప్యాడ్ల ఏర్పాటు జరిగింది. 
 
వాయి పేయ్ హయాంలో వాటి నిర్మాణం ప్రారంభం కాగా తరువాత కాలంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటి నిర్మాణాలను ఎక్కడికక్కడ ఆపేసింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 35 నిర్మాణాలను ఆపివేసింది. ప్రస్తుతం 70 రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో చైనాకు కోపం తెప్పించిన ఒక దాని గురించి సైన్యం చర్చ జరుపుతోంది. చెవాంగ్ రిన్ చెన్ వంతెన గురించి ప్రధానంగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. 
 
ఒకప్పుడు చైనాకు మనకు యుద్ధం జరిగిన సందర్భంలో చైనా సైనికులను మట్టుబెట్టడంతో ప్రభుత్వ నిర్ణయాల కంటే వేగంగా స్పందించిన చెవాంగ్ రిన్ చెన్ పేరును తూర్పు లద్దాఖ్ లో వంతెనను నిర్మించి భారత్ దానికి ఆయన పేరు పెట్టింది. 1400 మీటర్ల పొడవైన ఈ వంతెన సముద్రమట్టానికి 14000 అడుగుల ఎత్తులో ఉంది. కేవలం 15 నెలల సమయంలో -20 నుంచి -50 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య ఈ వంతెన నిర్మాణం జరిగింది. ఈ వంతెన పేరు వింటే చాలు చైనా కోపంతో ఊగిపోతుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: